Nara Lokesh: ఆత్మహత్య చేసుకున్న కమల్ కుటుంబాన్ని రాత్రికి రాత్రే మాయం చెయ్యడం దారుణం : నారా లోకేష్

ఆత్మహత్య చేసుకున్న నెల్లూరుకు చెందిన కమల్ కుటుంబాన్ని రాత్రికి రాత్రే మాయం చెయ్యడం దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అధికారులు, మంత్రి, వైకాపా నాయకులు

Nara Lokesh: ఆత్మహత్య చేసుకున్న కమల్ కుటుంబాన్ని రాత్రికి రాత్రే మాయం చెయ్యడం దారుణం : నారా లోకేష్
Nara Lokesh Nellore
Follow us

|

Updated on: Aug 12, 2021 | 8:26 PM

Nara Lokesh: ఆత్మహత్య చేసుకున్న నెల్లూరుకు చెందిన కమల్ కుటుంబాన్ని రాత్రికి రాత్రే మాయం చెయ్యడం దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అధికారులు, మంత్రి, వైకాపా నాయకులు కలిసి కమల్ కుటుంబాన్ని మాయం చేసారని ఆయన ఆరోపించారు. “వైసీపీ నేతలు పిరికివాళ్లు. అందుకే కమల్ కుటుంబాన్ని మాయం చేశారు. నేను పరామర్శకి వస్తే నిజాలు బయటపడతాయని భయపడుతున్నారు. నిరుద్యోగ సమస్యతో రాష్ట్రంలో ఉన్న యువకులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.” అని నారా లోకేష్ అన్నారు.

ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించిన లోకేష్.. ఇటీవల నెల్లూరులో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువకుడు కమల్‌కి నివాళులర్పించారు. అనంతరం జగన్ సర్కారుపై ధ్వజమెత్తారు. “ఎన్నికల ముందు ఫ్యాన్ గిర్రున తిప్పి 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు. ఇప్పుడు అదే ఫ్యాన్‌కి నిరుద్యోగులు ఉరి వేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చరిత్రలో ఇంత చెత్త క్యాలెండర్ ఇచ్చిన సీఎం గా ఫేక్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతారు. రిలయన్స్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ట్రైటాన్, లులూ, అదానీ, అమర్ రాజా అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి బై బై చెప్పేశాయి.” అని లోకేష్ ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు.

“ఉద్యోగాలు లేకపోగా టీడీపీ హయాంలో ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి యువనేస్తం 2వేల నిరుద్యోగ భృతి పథకాన్ని రద్దు చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు రాక 300 మంది నిరుద్యోగ యువ‌త ఆత్మహ‌త్యల‌కు పాల్పడ్డారు. సీఎంఐఈ తాజా నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగ రేటు 38% శాతం ఉంది. దేశంలోనే నిరుద్యోగ రేటు ఎక్కువుగా ఉన్న రాష్ట్రాల‌లో ఏపీ 4వ స్థానంలో ఉంది. చంద్రబాబు పాలనలో కియా, హీరో, అపోలో టైర్స్, ఫ్యాక్స్ కాన్, డిక్సన్ కంపెనీలు వచ్చాయి. ఫేక్ రెడ్డి పాలనలో ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్, స్పెషల్ స్టేటస్ లాంటి దొంగ లిక్కర్ బ్రాండ్లు కంపెనీలు వచ్చాయి.” అని లోకేష్ ఎద్దేవా చేశారు.

Read also: Online Dating app: ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌ ద్వారా యువతితో వీడియో కాల్.. కట్ చేస్తే, ఘోరం !

ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?