- Telugu News పొలిటికల్ ఫొటోలు Union home minister amit shah and his family visits srisailam mallikarjuna swamy temple
Amit Sha in Srisailam: అమిత్ షా రాజయోగం కోసం శ్రీశైలం భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి సందర్శనం.. చిత్రాలు
కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా దర్శించుకున్నారు.
Updated on: Aug 12, 2021 | 8:33 PM

కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం సందర్శించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.

శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. హైదరాబాద్ బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీశైలానికి చేరుకున్నారు.

శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చిన హోం మంత్రి అమిత్‌షాకు ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ వాణి మోహన్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ఆలయ అర్చకస్వాములు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

శ్రీశైలంలో కుటుంబసభ్యులతో కలిసి అమిత్‌షా పూజలు నిర్వహించారు. శ్రీశైలం.. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవదీ అష్టాదశ శక్తిపీఠాలలో ఆరవది కావడంతో తానీ క్షేత్ర సందర్శనం చేసినట్టు చెప్పారు అమిత్ షా.

శ్రావణ మాస శుభ సమయాన.. మల్లన్న భ్రమరాంబికను సందర్శిస్తే అఖండ రాజయోగ సిద్ధి కలుగుతుందని పండితుల సూచించినట్టు తెలుస్తోంది. అందుకే షా.. శ్రీశైల క్షేత్ర సందర్శనం చేసినట్టు చెబుతున్నారు..

శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చిన హోం మంత్రి అమిత్‌షాకు ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ వాణి మోహన్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ఆలయ అర్చకస్వాములు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అనంతరం అమిత్ షా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మల్లికార్జున స్వామి అమ్మవార్ల చిత్ర పటాన్ని కేంద్ర మంత్రికి బహూకరించారు.

శ్రీభ్రమరాంబిక, మల్లిఖార్జున స్వామి దర్శనానంతరం అమిత్ షా ఇక్కడొక అర్జున మొక్కను సైతం నాటడం విశేషం.

అమిత్ షా పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ తర్వాత శక్తివంతమైన నేతగా పేరున్న అమిత్ షా.. శ్రీశైలం పర్యటన సమాచారం ఒక్క రోజు ముందు మాత్రమే బయటకు వచ్చింది.

స్వామి వారిని దర్శనం చేసుకున్న అనంతరం దేవస్థానం అతిథి గృహంలో మధ్యాహ్నం భోజనం చేశారు. అనంతరం అక్కడ నుంచి హైదరాబాద్ చేరుకుని.. మధ్యాహ్నం 3.50 గంటలకు అమిత్ షా నుంచి ఢిల్లీకి పయనమవుతారు.




