Bhatti: అందుకోసమే ప్రగతి భవన్‌కు వెళ్లా.. ఆ మాటలు ముమ్మాటికీ మూర్ఖత్వమే: మల్లు భట్టి విక్రమార్క
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే వారిని నేను ఒక్కటి చేస్తున్నాననడం ముమ్మాటికీ ముర్ఖత్వం అన్నారు తెలంగాణ కాంగ్రెస్

Bhatti Vikramarka: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే వారిని నేను ఒక్కటి చేస్తున్నాననడం ముమ్మాటికీ ముర్ఖత్వం అన్నారు తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క. ముఖ్యమంత్రిని కలవడాని ఏమైనా సెక్రటేరియట్ ఉందా? అందుకే ప్రజా సమస్యల కోసం ప్రగతి భవన్ వెళ్ళాను. అని టీవీ9తో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. పార్టీ నిర్ణయం ప్రకారమే తాను ఇవాళ ప్రగతి భవన్ కి వెళ్ళానని భట్టి తేల్చి చెప్పారు.
“నేను మాట్లాడని మాటలను.. మాట్లాడానని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. నా మీద, పార్టీ మీదా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దళిత బంధు విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడడానికి వెళ్ళాను. పైలెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా నా నియజకవర్గాన్ని తీసుకోవడం అనేది నన్ను టార్గెట్ చేయడం కోసమే. నేనే నా ప్రాంతంలో దళిత బంధు పెట్టించుకున్నా అనడం బురద చల్లడమే. నాకు – రేవంత్ రెడ్డికి ఎలాంటి విభేదాలు లేవు” అని భట్టి విక్రమార్క పూర్తిస్థాయి స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు.
Read also: Corona: కరోనాపై పోరులో మరో మైలురాయిని చేరిన తెలంగాణ రాష్ట్రం.. ఈ నెలాఖరులోపు మరో టార్గెట్