రజనీకి కీలక పదవి ఇవ్వబోతున్న బీజేపీ..?

రాజకీయాల్లోకి రావాలని తమిళ సూపర్‌స్టార్ ఎప్పటి నుంచో ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగా ఆ మధ్యన ఓ ముందుడుగు వేసి రజనీ మక్కల్ మంద్రమ్ అనే పార్టీని కూడా పెట్టారు. కానీ పేరుకు మాత్రమే పార్టీని పెట్టిన రజనీ.. దాని విస్తరణ కోసం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు రజనీ తరువాత పార్టీని పెట్టిన తమిళ మరో నటుడు కమల్ హాసన్.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. ఇదంతా పక్కనపెడితే […]

రజనీకి కీలక పదవి ఇవ్వబోతున్న బీజేపీ..?
Follow us

| Edited By:

Updated on: Sep 02, 2019 | 1:15 PM

రాజకీయాల్లోకి రావాలని తమిళ సూపర్‌స్టార్ ఎప్పటి నుంచో ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగా ఆ మధ్యన ఓ ముందుడుగు వేసి రజనీ మక్కల్ మంద్రమ్ అనే పార్టీని కూడా పెట్టారు. కానీ పేరుకు మాత్రమే పార్టీని పెట్టిన రజనీ.. దాని విస్తరణ కోసం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు రజనీ తరువాత పార్టీని పెట్టిన తమిళ మరో నటుడు కమల్ హాసన్.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. ఇదంతా పక్కనపెడితే ఎప్పటినుంచో కాషాయ పార్టీతో కాస్త చనువుగా ఉంటూ వస్తోన్న రజనీ.. ఈ మధ్య కాలంలో మోదీ, అమిత్‌ షాలపై ప్రశంసలు కురిపిస్తూ.. ఆ పార్టీకి పరోక్షంగా మద్దతును ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు తమిళనాడు రాష్ట్ర బీజేపీ చీఫ్ పదవి లభించబోతున్నట్లు అక్కడి వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై సౌందరరాజన్‌ను తెలంగాణ గవర్నర్‌గా నియమిస్తూ ఇటీవల రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ చీఫ్ పదవికి ఆమె రాజీనామా చేయగా.. ఆ స్థానంలో ఎవరు వస్తారన్నది తమిళనాట హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో సీనియర్ నేత పొన్. రాధాకృష్ణన్ పేరు బలంగా వినిపిస్తుండగా.. సీపీ రాధాకృష్ణన్, హెచ్. రాజా, వానతి శ్రీనివాసన్, ప్రధాన కార్యదర్శి నరేంద్రన్, మాజీ మంత్రి నయనార్ నాగేంద్రన్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక వీరితో పాటు రజనీ పేరు కూడా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ ఇటీవలే చెన్నైలో పర్యటించిన సందర్భంగా రజనీకాంత్‌తో రహస్యంగా చర్చించారని, ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర పగ్గాలను ఆఫర్‌ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇది జరిగే పనికాదని మరో వర్గం అభిప్రాయాలను వ్యక్తం చేస్తోంది. మరి మొత్తానికి తమిళనాడు రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఎవరికీ దక్కుతాయి..? రజనీకాంత్ బీజేపీలో చేరుతాడా..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం త్వరలోనే తేలనుంది.

ఉదయం లేవగానే తలనొప్పి వేధిస్తుందా.? మీకు ఈ ప్రమాదం ఉన్నట్లే..
ఉదయం లేవగానే తలనొప్పి వేధిస్తుందా.? మీకు ఈ ప్రమాదం ఉన్నట్లే..
ప్రమాదం అంచున లీనింగ్‌ టవర్‌..ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు..
ప్రమాదం అంచున లీనింగ్‌ టవర్‌..ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు..
ఛార్జింగ్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? భారీ నష్టం తప్పదు
ఛార్జింగ్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? భారీ నష్టం తప్పదు
తగ్గేదేలే.. వేడుకలకు సిద్ధంగా ఉండండి. మంత్రి కేటీఆర్ ట్వీట్...
తగ్గేదేలే.. వేడుకలకు సిద్ధంగా ఉండండి. మంత్రి కేటీఆర్ ట్వీట్...
మీ శరీరంలో ఈ సమస్య ఉంటే పొరపాటున కూడా పాలు తాగకండి..ఆరోగ్యం మరింత
మీ శరీరంలో ఈ సమస్య ఉంటే పొరపాటున కూడా పాలు తాగకండి..ఆరోగ్యం మరింత
ఒత్తిడితో చిత్తవుతున్నారా.? చామంతి పూలతో ఇలా చేయండి..
ఒత్తిడితో చిత్తవుతున్నారా.? చామంతి పూలతో ఇలా చేయండి..
కరివేపాకుతో ఈ సమస్యలన్నీ దూరం.. ఇప్పటికైనా పరేయకుండా తినేయండి..
కరివేపాకుతో ఈ సమస్యలన్నీ దూరం.. ఇప్పటికైనా పరేయకుండా తినేయండి..
10 రకాల ఉప్పులు ఉన్నాయి.. మీ ఆరోగ్యానికి ఏది ఉత్తమమైనదో తెలుసా..?
10 రకాల ఉప్పులు ఉన్నాయి.. మీ ఆరోగ్యానికి ఏది ఉత్తమమైనదో తెలుసా..?
200 మెగాపిక్సెల్స్ కెమెరా, మరెన్నో స్టన్నింగ్‌ ఫీచర్స్‌..
200 మెగాపిక్సెల్స్ కెమెరా, మరెన్నో స్టన్నింగ్‌ ఫీచర్స్‌..
తమలపాకులేని పూజ, శుభకార్యాలు అసంపూర్ణం.. రీజన్ ఏమిటంటే
తమలపాకులేని పూజ, శుభకార్యాలు అసంపూర్ణం.. రీజన్ ఏమిటంటే