టీఆర్ఎస్‌కు బీజేపీ పొగ.. దొరికిందయ్యా ఛాన్స్..!

టీఆర్ఎస్‌కు బీజేపీ పొగ.. దొరికిందయ్యా ఛాన్స్..!

తెలంగాణలో ఎప్పుడు అధికారం చేపట్టకపోతిమా.. అన్న ఆశతో ఉంది కమలదళం. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమంటూ ఇప్పటికే.. ఢంకా వాయించి మరీ చెబుతున్నారు. అయితే క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ఉపయోగించుకుంటుంది బీజేపీ. అయితే పార్టీని పటిష్టం చేసేందుకు ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తూ.. ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతోంది. ఇప్పటి వరకు తెలుగుదేశంలో ఉన్న కీలక నేతలపై దృష్టి […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 02, 2019 | 1:56 PM

తెలంగాణలో ఎప్పుడు అధికారం చేపట్టకపోతిమా.. అన్న ఆశతో ఉంది కమలదళం. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమంటూ ఇప్పటికే.. ఢంకా వాయించి మరీ చెబుతున్నారు. అయితే క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ఉపయోగించుకుంటుంది బీజేపీ. అయితే పార్టీని పటిష్టం చేసేందుకు ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తూ.. ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతోంది. ఇప్పటి వరకు తెలుగుదేశంలో ఉన్న కీలక నేతలపై దృష్టి సారించి కొంచెం సక్సెస్ అయ్యింది. అంతే కాదు.. అటు హస్తం పార్టీలోని కీలక నేతల్ని కూడా ట్రాప్ చేస్తోంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే.. అధికార పార్టీలోని వారిని లాగే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అలాగే అనిపిస్తున్నాయి.

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి పదవి నుంచి ఆయన్ను తప్పిస్తారని ప్రచారం జరగడం, తనకు మంత్రి పదవి బిక్ష కాదని ఈటల సంచలన వ్యాఖ్యలు చేయడం, గులాబీ జెండాకు తామే ఓనర్లమని ఉద్వేగంగా మాట్లాడడం, ఆ వెంటనే కేసీఆర్‌ని పొగడడం రాజకీయ చర్చకు దారితీశాయి. అయితే ఈ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ పావులు కదుపుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కంటే హరీష్ రావు, ఈటల రాజేందర్ ఎక్కువ కష్టపడ్డారని అభిప్రాయపడ్డారు.

అంతేకాదు టీఆర్ఎస్ పార్టీలో పరిస్థితి దారుణంగా ఉందని.. అసలైన ఉద్యమకారులు అణచివేతకు గురయ్యారని విమర్శించారు. టీఆర్ఎస్‌లో ఉద్యమకారులు, కార్యకర్తలతో కలిసి పనిచేసేది కేవలం హరీశ్‌రావు, ఈటల మాత్రమేనని అన్నారు. ఈటల మాటలకు దయాకర్‌రావు వివరణ ఇవ్వడం దౌర్భాగ్యమంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడిందని, ఎన్నివేల టన్నులైనా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అరవింద్ అన్నారు.

అయితే అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. హరీష్ రావు, ఈటెలను పొగడటం వెనక అసలు కథ.. వారిని పార్టీలోకి ఆకర్షించేందుకు అడుగులు వేస్తున్నారా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయని విశ్లేషకులు గుసగుసలాడుతున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu