Smriti Irani: ఆటో ఎక్కి, స్కూటర్ పై ప్రయాణించి.. బీజేపీ మహిళా కార్యకర్తలతో కోలాటం ఆడిన కేంద్ర మంత్రి
ఎన్నికల్లో తమ పార్టీ విజయావకాశాలకు ఆయా నేతలు పడే పాట్లు, చేసే ఫీట్లు ఇన్నీ అన్నీ కావు. ఓటర్లతో మమేకం కావాలంటే మరి కాస్త కాస్త పడక తప్పదు. హోదాలు మరచి సాధారణ వ్యక్తుల్లాగే బిహేవ్ చేయాల్సిందే.
ఎన్నికల్లో తమ పార్టీ విజయావకాశాలకు ఆయా నేతలు పడే పాట్లు, చేసే ఫీట్లు ఇన్నీ అన్నీ కావు. ఓటర్లతో మమేకం కావాలంటే మరికాస్త ఇబ్బందిపడక తప్పదు. హోదాలు మరచి సాధారణ వ్యక్తుల్లాగే బిహేవ్ చేయాల్సిందే. ఇక కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ విషయానికే వద్దాం.. ఆమె శనివారం కోయంబత్తూరులో తమ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారానికి వచ్చారు. ఈ సందర్భంగా మొదట ఆటో ఎక్కి, ఆ తరువాత స్కూటర్ పై ప్రయాణించారు . బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ తో కలిసి ఆమె తొలుత స్కూటర్ ఎక్కారు. స్థానికులతో ఇంటరాక్ట్ అయ్యారు. వారి సమస్యల గురించి తెలుసుకున్నారు. కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి వనతి శ్రీనివాసన్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మీ సమస్యలు తీరాలంటే ఈమెకే ఓటు వేయాలని స్మృతి ఇరానీ స్థానిక ఓటర్లను కోరారు. తమిళ ఓటర్ల నాడి తమకు తెలుసునని, వారు వివేకంతో మంచి గుణగణాలు గల అభ్యర్థులనే గెలిపిస్తారని ఆమె అన్నారు. ఈ రాష్ట్రానికి అన్నా డీఎంకే -బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఎంతయినా అవసరమన్నారు.
కాగా- ఒక దశలో స్మృతి ఇరానీ బీజేపీ మహిళా కార్యకర్తలతో కలిసి కోలాటం ఆడారు. వారితో డ్యాన్స్ చేశారు. అటు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తమిళనాడులో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా కూడా తమిళనాడును సందర్శించనున్నారు. ఈ రాష్ట్రంలో తమ కూటమి ప్రభుత్వం ఏర్పడగలదని వారు ఆశిస్తున్నారు. మోదీ ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన ముగిసిన అనంతరం ఆయన ఈ రాష్ట్రాన్ని విజిట్ చేయవచ్చు.
#WATCH Coimbatore: Union Minister Smriti Irani performs traditional dance* with BJP workers, as a part of election campaigning for Vanathi Srinivasan, the party’s candidate from Coimbatore South constituency.#TamilNaduElections pic.twitter.com/1S6zQF2RgL
— ANI (@ANI) March 27, 2021
మరిన్ని ఇక్కడ చదవండి: తమిళనాడు సీఎం పళనిస్వామిని డీఎంకే నేత స్టాలిన్ చెప్పుతో పోల్చిన మాజీ కేంద్ర మంత్రి
పురుషుడి ప్రైవేట్ పార్ట్‌పై శాస్త్రవేత్త కామెంట్.. వ్యంగ్యంగా రియాక్ట్ అయిన బాలీవుడ్ భామ.!