‘ మాకు అరగంట చాలు ‘.. సంజయ్ రౌత్

మహారాష్ట్ర అసెంబ్లీలో బల నిరూపణకు గాను తమకు సుప్రీంకోర్టు 30 గంటల సమయం ఇచ్చిందని, అయితే మాకు 30 నిముషాలు చాలని శివసేన నేత సంజయ్ రౌత్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తమ పార్టీతో బాటు కాంగ్రెస్, ఎన్సీపీలు 162 మంది ఎమ్మెల్యేలను పరేడ్ చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. (తమకు 170 మంది సభ్యుల బలం ఉందని బీజేపీ చెప్పుకుంటోంది). శాసన సభలో తమ మెజారిటీని నిరూపించుకోగలమన్న ధీమాను సంజయ్ వ్యక్తం చేశారు. కాగా-బుధవారం […]

' మాకు అరగంట చాలు '.. సంజయ్ రౌత్
Follow us

|

Updated on: Nov 26, 2019 | 12:29 PM

మహారాష్ట్ర అసెంబ్లీలో బల నిరూపణకు గాను తమకు సుప్రీంకోర్టు 30 గంటల సమయం ఇచ్చిందని, అయితే మాకు 30 నిముషాలు చాలని శివసేన నేత సంజయ్ రౌత్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తమ పార్టీతో బాటు కాంగ్రెస్, ఎన్సీపీలు 162 మంది ఎమ్మెల్యేలను పరేడ్ చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. (తమకు 170 మంది సభ్యుల బలం ఉందని బీజేపీ చెప్పుకుంటోంది). శాసన సభలో తమ మెజారిటీని నిరూపించుకోగలమన్న ధీమాను సంజయ్ వ్యక్తం చేశారు. కాగా-బుధవారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని, సాయంత్రం 5 గంటలకు తాత్కాలిక స్పీకర్ ఫ్లోర్ టెస్ట్ నిర్వహిస్తారని సేన-కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు తమకెంతో సంతృప్తిని కలిగించాయని కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీ రాజ్ చవాన్ అన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అటు-ప్రో-టెమ్ స్పీకర్ గా ఎంపిక చేసేందుకు ఆరు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలాసాహెబ్ థోరత్, బీజేపీ సభ్యుడు కాళిదాస్ కలంకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.సి. పడావీ, బహుజన్ వికాస్ అఘాడీ సభ్యుడు హితేంద్ర ఠాకూర్, ఎన్సీపీ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ కూడా అయిన దిలీప్ వాల్సే పాటిల్, బీజేపీ ఎమ్మెల్యే బబన్ పచ్ పుట్ ల పేర్లను గవర్నర్ పరిశీలనకు పంపారు.

ఫ్లోర్ టెస్ట్ ను లైవ్ గా ప్రసారం చేయాలని , సీక్రెట్ బ్యాలట్ అంటూ ఉండదని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసిన ఎన్సీపీ నేత జయంత్ పాటిల్.. కోర్టు ఉత్తర్వులు రాజ్యాంగ విలువలను పరిరక్షించాయని పేర్కొన్నారు. మరో వైపు.. శాసన సభలో తామే మెజారిటీని నిరూపించుకోగలమని బీజేపీ కూడా పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందని ఈ పార్టీ చెబుతోంది. అయితే శరద్ పవార్ మాత్రం… 54 మందికి గాను 51 మంది ఎమ్మెల్యేలు తమవెంట ఉన్నారని ప్రకటించిన విషయం గమనార్హం.