AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుల వివాదంలో శ్రీదేవి.. జెసి ఏమన్నారంటే?

వైసీపీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే కుల వివాదంలో చిక్కుకున్నారు. షెడ్యూల్ కులానికి చెందిన మహిళ కాకపోయినా ఎస్సీనంటూ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి, గెలుపొందారని ఆమెపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదం ఆసరాగా చేసుకుని టిడిపి నేతలు ఎమ్మెల్యేపై తీవ్రమైన ఆరోపణలతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. గుంటూరు జిల్లా తాడికొండ శాసన సభ్యురాలు శ్రీదేవిపై కుల వివాదం రాజుకుంది. ఆమె షెడ్యూలు కులాలకు చెందిన వారు కాకపోయినా రిజర్వుడు స్థానమైన తాడికొండ నుంచి అసెంబ్లీకి పోటీ […]

కుల వివాదంలో శ్రీదేవి.. జెసి ఏమన్నారంటే?
Rajesh Sharma
| Edited By: |

Updated on: Nov 26, 2019 | 3:47 PM

Share

వైసీపీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే కుల వివాదంలో చిక్కుకున్నారు. షెడ్యూల్ కులానికి చెందిన మహిళ కాకపోయినా ఎస్సీనంటూ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి, గెలుపొందారని ఆమెపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదం ఆసరాగా చేసుకుని టిడిపి నేతలు ఎమ్మెల్యేపై తీవ్రమైన ఆరోపణలతో దూకుడు ప్రదర్శిస్తున్నారు.

గుంటూరు జిల్లా తాడికొండ శాసన సభ్యురాలు శ్రీదేవిపై కుల వివాదం రాజుకుంది. ఆమె షెడ్యూలు కులాలకు చెందిన వారు కాకపోయినా రిజర్వుడు స్థానమైన తాడికొండ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారని టిడిపి నేతలు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కులాన్ని తప్పుగా పేర్కొనడం నేరమని వారు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి అనర్హురాలిగా ప్రకటించి, తప్పుడు సమాచారం ఇచ్చినందుకు శ్రీదేవిపై తగిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

టిడిపి నేతల ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఉండవల్లి శ్రీదేవిని విచారణకు రావాలని కోరారు. అన్ని వివరాలతో వచ్చిన శ్రీదేవిని, జాయింట్ కలెక్టర్ దినేశ్ కుమార్ విచారించారు. శ్రీదేవి స్టడీ సర్టిఫికేట్లను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. తన మెడిసిన్ సర్టిఫికేట్లను జెసికి చూపించారు శ్రీదేవి. వైద్యురాలిగా చేసిన సర్వీసును కూడా తగు పత్రాలతో సాక్ష్యాలుగా చూపించారు శ్రీదేవి. శ్రీదేవి చూపించిన పత్రాలను క్రాస్ చెక్ చేసిన తర్వాత తగు నిర్ణయం తీసుకుంటామని జెసి చెబుతున్నారు. తెలుగుదేశం హయాంలో రాజధాని నిర్మాణం పేరిట జరిగిన అవినీతిని తాను ప్రశ్నిస్తున్నందునే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని శ్రీదేవి ఆరోపిస్తున్నారు.

Follow Us
తిరుపతిలో దారుణం:నడిరోడ్డుపై డబుల్‌ మర్డర్‌ కలకలం!మహిళే సూత్రధారి
తిరుపతిలో దారుణం:నడిరోడ్డుపై డబుల్‌ మర్డర్‌ కలకలం!మహిళే సూత్రధారి
అరటిపండు vs ఆరెంజ్.. ఉదయం శక్తి కోసం ఏది తినడం మంచిది?
అరటిపండు vs ఆరెంజ్.. ఉదయం శక్తి కోసం ఏది తినడం మంచిది?
గురువారం ఖిచిడీ తినకూడదా? శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి.. ఈ నియమం..
గురువారం ఖిచిడీ తినకూడదా? శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి.. ఈ నియమం..
వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు
వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు
గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఈ మొక్కను ఇలా వాడితే.. జుట్టు నల్లగా మారడమే కాదు.. వద్దన్నా ..
ఈ మొక్కను ఇలా వాడితే.. జుట్టు నల్లగా మారడమే కాదు.. వద్దన్నా ..
పూరీ జగన్నాథ ఆలయంలోని మూడో మెట్టు రహస్యం.. యమశిలపై అడుగు పెడితే..
పూరీ జగన్నాథ ఆలయంలోని మూడో మెట్టు రహస్యం.. యమశిలపై అడుగు పెడితే..
యూరిన్ సరిగా రానివాళ్ళు పూర్వీకుల తిన్నది తింటే.. నిముషాల్లోనే
యూరిన్ సరిగా రానివాళ్ళు పూర్వీకుల తిన్నది తింటే.. నిముషాల్లోనే
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ 'పెద్ది'.. ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ 'పెద్ది'.. ఎక్కడ చూడొచ్చంటే?
జూలై 9 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో శుభవార్తలు..
జూలై 9 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో శుభవార్తలు..