సురభి నాటకాలొద్దు.. కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్

తెలుగు రాష్ట్రాల్లో సేవ్ నల్లమల ఉద్యమం ఉదృతం అవుతోంది. నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అందరూ గళం విప్పుతున్నారు. సినీ, రాజకీయ, ప్రజా సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పటివరకు సైలెంట్‌గా ఉన్న తెలంగాణ సర్కార్ తాజాగా స్పందించింది.  సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానని తగు చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో పేర్కొన్నారు. I hear all of your concern on the issue of uranium […]

సురభి నాటకాలొద్దు.. కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్
Revanth Reddy Sensational Comments On KTR
Follow us

|

Updated on: Sep 14, 2019 | 3:35 AM

తెలుగు రాష్ట్రాల్లో సేవ్ నల్లమల ఉద్యమం ఉదృతం అవుతోంది. నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అందరూ గళం విప్పుతున్నారు. సినీ, రాజకీయ, ప్రజా సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పటివరకు సైలెంట్‌గా ఉన్న తెలంగాణ సర్కార్ తాజాగా స్పందించింది.  సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానని తగు చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో పేర్కొన్నారు.

మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్‌ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ”కేటీఆర్‌ గారూ.. సురభి నాటకాలు కట్టిపెట్టి యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయండి” అని పేర్కొన్నారు. ఈ మేరకు రేవంత్‌ ట్వీట్‌ చేశారు. యురేనియం తవ్వకాల అంశంలో ప్రజల ఆవేదనను పరిగణనలోకి తీసుకుంటామని.. వ్యక్తిగతంగా ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. కేటీఆర్‌ ట్వీట్‌ చేసిన కాసేపటికే రేవంత్‌ కూడా ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ అనుమతులు రద్దు చేయాలని కోరారు.

యురేనియం తవ్వకాలపై తెలుగు సెలబ్రిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు శేఖర్ కమ్ముల సేవ్ నల్లమల అంటూ సపోర్ట్ తెలియజేసారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్, విజయ దేవరకొండ, సాయి ధరమ్ తేజ్, అనసూయ, సమంత, రామ్, వీవీ వినాయక్, లావణ్య త్రిపాఠి లాంటి చాలా మంది స్టార్లు  సైతం సేవ్ నల్లమల ఉద్యమానికి మద్దతు తెలిపారు. యురేనియం తవ్వకాలతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడటమే కాకుండా.. అది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.