రేవంత్ గారూ! పగ్గాలు ఎప్పుడు చేపట్టబోతున్నారు?
రేవంత్ రెడ్డి..తెలంగాణలో ఫైర్ బ్రాండ్ నేత. తాను ఒకసారి అనుకుంటే ఎదుటివారు ఎంతటి వ్యక్తైనా మడమతిప్పని నైజం ఈ నాయకుడి సొంతం. అందుకే రాజకీయాల్లో రేవంత్‌కు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ప్రభుత్వంపై విమర్శలు దాడి చేయాలన్నా, సీఎం కేసీఆర్‌పై వాగ్దాటి ప్రదర్శించాలన్నా ఆయనకే చెల్లుతుంది. పార్టీ ఏదైనా నిజాయితీతో పనిచెయ్యడం రేవంత్‌కు అలవాటు. టీడీపీలో ఉన్నంతకాలం పార్టీని ముందుకు నడిపించిన ఈ సీనియర్ నేత..ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినా కూడా అంకితభావంతో పనిచేస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యేగా […]
రేవంత్ రెడ్డి..తెలంగాణలో ఫైర్ బ్రాండ్ నేత. తాను ఒకసారి అనుకుంటే ఎదుటివారు ఎంతటి వ్యక్తైనా మడమతిప్పని నైజం ఈ నాయకుడి సొంతం. అందుకే రాజకీయాల్లో రేవంత్‌కు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ప్రభుత్వంపై విమర్శలు దాడి చేయాలన్నా, సీఎం కేసీఆర్‌పై వాగ్దాటి ప్రదర్శించాలన్నా ఆయనకే చెల్లుతుంది. పార్టీ ఏదైనా నిజాయితీతో పనిచెయ్యడం రేవంత్‌కు అలవాటు. టీడీపీలో ఉన్నంతకాలం పార్టీని ముందుకు నడిపించిన ఈ సీనియర్ నేత..ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినా కూడా అంకితభావంతో పనిచేస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా తనకు ఎంపీ టికెట్ ఇచ్చన హస్తం పార్టీని తెలంగాణలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
కాగా తాజాగా ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలోని పార్టీ వ్యవహారాలపై ఆమెతో చర్చించినట్టు తెలుస్తోంది. తనకు పార్టీ మారే ఆలోచన లేదంటూ పలుమార్లు క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి… గాంధీ కుటుంబానికి సన్నిహితంగా మారుతున్నారని రాష్ట్ర రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో ఉన్న బీజేపీ నుంచి పలుమార్లు ఆఫర్లు వచ్చినా రేవంత్ అటువైపు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. కాగా రాష్ట్రంలో పార్టీ ప్రెసిడెంట్ మార్పు జరిగితే రేవంత్ రెడ్డికే పట్టం కట్టే అవకాశాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వంపై ధీటుగా పోరాడటం, మాస్ ఇమేజ్, కేసీఆర్ ఎదుర్కునే సత్తా ఉంటడంతో అధినాయకత్వం రేవంత్ వైపే మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కుటుంబంతో సోనియా గాంధీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏది ఏమైనా పార్టీ మారిన రెండు సంవత్సరాల్లోనే ఆయన పీసీసీ ఛీప్ అయితే మాత్రం అది ఒక రికార్డుగానే చెప్పుకోవాలి.
.