నేను నోటితో చెప్పుకోలేని విధంగా దుర్భాషలాడారు: మహిళా ఎమ్మెల్యే

సోమవారం వైఎస్ఆర్ వర్థంతి.. అలాగే వినాయక చవితి సందర్భంగా వైసీపీ మహిళా ఎమ్మెల్యే శ్రీదేవి గుంటూరు జిల్లాలోని స్థానిక వినాయక చవితి ఉత్సవాలకు హాజరుకాగ.. ఆమెను స్థానిక టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో.. ఈ గొడవ కాస్తా.. చినికి చినికి గాలి వానగా మారింది. ఈ ఘటనను నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా.. వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ.. మీడియా ముందు వాపోయారు. తనను నోటితో చెప్పుకోలేని విధంగా దూర్భాషలాడారని పేర్కొన్నారు. సోమవారం […]

నేను నోటితో చెప్పుకోలేని విధంగా దుర్భాషలాడారు: మహిళా ఎమ్మెల్యే
Follow us

| Edited By:

Updated on: Sep 03, 2019 | 4:08 PM

సోమవారం వైఎస్ఆర్ వర్థంతి.. అలాగే వినాయక చవితి సందర్భంగా వైసీపీ మహిళా ఎమ్మెల్యే శ్రీదేవి గుంటూరు జిల్లాలోని స్థానిక వినాయక చవితి ఉత్సవాలకు హాజరుకాగ.. ఆమెను స్థానిక టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో.. ఈ గొడవ కాస్తా.. చినికి చినికి గాలి వానగా మారింది. ఈ ఘటనను నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా.. వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ.. మీడియా ముందు వాపోయారు. తనను నోటితో చెప్పుకోలేని విధంగా దూర్భాషలాడారని పేర్కొన్నారు.

సోమవారం వైఎస్ఆర్ వర్థంతి, వినాయక చవితి సందర్భంగా వారు అనేక కార్యక్రమాల్లో పాల్గొనటం జరిగిందని.. అందులో భాగంగానే.. మేము తాడికొండలోని గణేష్ పూజకు వెళ్లటం జరిగిందని చెప్పారు. నేను నా భర్త అన్ని మతాలను గౌరవిస్తామని, అన్ని దేవుళ్లను పూజిస్తామని తెలిపారు. నా భర్త కాపు సామాజిక వర్గానికి చెందినవారని, నేను దళితురాలినని చెప్పారు.

కాగా.. రాజధానిలో ఈ కుల ధూషణలతో దళితులను భయపెట్టాలని టీడీపీ నేతలు చూస్తున్నారని అన్నారు. దళితులంటే టీడీపీ నాయకులకు చిన్నచూపని.. నాపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని వాపోయారు. అలాగే.. ఎన్నికల పోలింగ్ రోజు కూడా ఇలానే.. కులం పేరుతో.. టీడీపీ నేతలు నన్ను దూషించారన్నారు. టీడీపీ నాయకులు కులం పేరుతో రాజధానిలో మత ద్వేషాలు రెచ్చగొట్టడానికి పాల్పడుతున్నారు. నేను కేసు పెట్టిన నలుగురితో పాటుగా.. మాజీ సీఎం చంద్రబాబును కూడా అరెస్ట్ చేయాలని మహిళా ఎమ్మెల్యే శ్రీదేవి చెప్పారు. వీరి ప్రవర్తనకు పోలీసులు కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుందని.. మాజీ శాసనసభ్యుడు శ్రావణ్ కుమార్ రాజధానిలో అగ్రవర్ణాలకు కొమ్ముకాస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే శ్రీదేవి.