AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జనసేన పార్టీకి ‘రూ.100 కోట్ల ఫండ్’ ప్లాన్ ఎవరిది..?

పవర్ స్టార్ పవన్ అన్నా.. మెగాస్టార్ చిరంజీవి అన్నా.. తెలుగు రాష్ట్రాల్లోనే గాక.. దేశవ్యాప్తంగా.. ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఇక డై హార్ట్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాళ్ల సినిమాలు రిలీజ్ అయితే.. థియేటర్‌లు పూలమాలలతో.. అభిమానుల సందడితో నిండిపోతాయి. అయితే.. ఈ మధ్య ఒక వార్త.. బాగా వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని నాగబాబునే స్వయంగా వివరించారు కూడా. జనసేన పార్టీకి 100 కోట్ల రూపాయలను ఫండ్‌గా కేటాయించాలని.. పార్టీ కార్యకర్తలు, […]

జనసేన పార్టీకి 'రూ.100 కోట్ల ఫండ్' ప్లాన్ ఎవరిది..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 03, 2019 | 3:54 PM

పవర్ స్టార్ పవన్ అన్నా.. మెగాస్టార్ చిరంజీవి అన్నా.. తెలుగు రాష్ట్రాల్లోనే గాక.. దేశవ్యాప్తంగా.. ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఇక డై హార్ట్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాళ్ల సినిమాలు రిలీజ్ అయితే.. థియేటర్‌లు పూలమాలలతో.. అభిమానుల సందడితో నిండిపోతాయి.

అయితే.. ఈ మధ్య ఒక వార్త.. బాగా వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని నాగబాబునే స్వయంగా వివరించారు కూడా. జనసేన పార్టీకి 100 కోట్ల రూపాయలను ఫండ్‌గా కేటాయించాలని.. పార్టీ కార్యకర్తలు, అభిమానులు అనుకున్నట్లు.. అది విని తాను షాక్‌ అయినట్లు ప్రముఖ నటుడు నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్‌‌.. ‘నా ఛానెల్.. నా ఇష్టం’ ద్వారా తెలిపారు. అసలు ఇప్పటివరకూ ఏ రాజకీయ పార్టీకి.. రాజకీయ నేతలు కానీ.. అభిమానులు కానీ.. ఇలా ఆలోచన చేయలేదని.. ఆయన తన యూట్యూబ్ వీడియోలో వివరించారు. అందుకు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు.. అలాగే.. తన తమ్ముడి మీద ప్రజలకు ఉన్న అభిమానాన్ని చూసి చాలా సంతోషం గానూ కూడా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ ఫండ్ గురించి తెలుసుకున్న పవర్ స్టార్ అభిమానులు బ్యాంకుల్లో డబ్బులు వేయడానికి క్యూ కడుతున్నారని ఆ వీడియోలో వివరించారు. చాలా రాజకీయ పార్టీలు.. ఎన్నికల్లో.. డబ్బులు విదజల్లారని.. కానీ.. జనసేన పార్టీ మాత్రం నిజాయితీగా.. ఎన్నికల బరిలో నిలబడిందని ఈ సందర్భంగా వివరించారు.

చాలా రోజుల తర్వాత యూట్యూబ్‌లో ప్రత్యక్ష్యమయిన నాగబాబు వీడియో చూసిన ప్రేక్షకులు, అభిమానులు షాక్ అవుతున్నారు. ఫ్యాన్స్ జై పవన్.. జై జనసేన అంటున్నా.. మరికొందరు మాత్రం అది విని షాక్ అవుతున్నారు. కావాలనే.. పార్టీని.. అభిమానులను అడ్డం పెట్టుకుని పార్టీ.. నాయకులు ఆడుతున్న నాటకమని అంటున్నారు. మరికొందరు మాత్రం.. బ్లాక్ మనీని.. వైట్ మనీని మార్చుకోవడానికే ప్లాన్ అంటున్నారు. అయితే.. ఇప్పుడు ఈ విషయాలన్నీ పక్కన పెట్టినా.. అలా డొనేషన్‌గా కలెక్ట్ చేసిన మనీ అంతా.. ఏం చేస్తారు..? ఎక్కడ పెడతారు..? ఎలా ఖర్చు చేస్తారు..? అనే ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి.

కాగా.. ఈ విషయంపై ఇప్పటి వరకూ పవర్ స్టార్ మాత్రం నోరు మెదపలేదు. పవన్‌కు ఆదర్శాలు ఎక్కువ కాబట్టి.. ఆ డబ్బుతో.. ప్రజలకే ఖర్చుపెడతారా..? లేక పార్టీ కోసం వినియోగిస్తారా..? అనేది తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.

మరోసారి తెరపైకి డ్రగ్స్ మాఫియా.. ఇద్దరు దర్శకులు అరెస్ట్..
మరోసారి తెరపైకి డ్రగ్స్ మాఫియా.. ఇద్దరు దర్శకులు అరెస్ట్..
ఆ జిల్లాలో క్షణక్షణం, భయం భయం.. బయటకు రావాలంటేనే..
ఆ జిల్లాలో క్షణక్షణం, భయం భయం.. బయటకు రావాలంటేనే..
తారక్‌, చిరు మధ్య యుద్ధం.. అది చూడ్డానికి టాలీవుడ్ అంతా సిద్ధం..
తారక్‌, చిరు మధ్య యుద్ధం.. అది చూడ్డానికి టాలీవుడ్ అంతా సిద్ధం..
IPL 2025: 8 ఫోర్లు, 4 సిక్స్‌లు.. 35 బంతుల్లో మారణహోమం..
IPL 2025: 8 ఫోర్లు, 4 సిక్స్‌లు.. 35 బంతుల్లో మారణహోమం..
పహల్గామ్ ఉగ్రదాడి ఘటన.. బాబా వాంగ జోస్యం నిజమవుతోందా..?
పహల్గామ్ ఉగ్రదాడి ఘటన.. బాబా వాంగ జోస్యం నిజమవుతోందా..?
రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్.. జూన్‌ 1 నుంచి ఇంటింటా పండగే..!
రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్.. జూన్‌ 1 నుంచి ఇంటింటా పండగే..!
కాలినడకన తిరుమల శ్రీవారి చెంతకు టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు
కాలినడకన తిరుమల శ్రీవారి చెంతకు టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు
పాన్ ఇండియా అయినా.. రీజినల్ అయినా.. సినిమాలో ఇది మాత్రం పక్క..
పాన్ ఇండియా అయినా.. రీజినల్ అయినా.. సినిమాలో ఇది మాత్రం పక్క..
JEE విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. IITల్లో సీట్లు పెరుగుతున్నాయోచ్!
JEE విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. IITల్లో సీట్లు పెరుగుతున్నాయోచ్!
తిరుమలలోని వీఐపీ కాటేజీలో అనుకోని అతిథి.. పరుగులు తీసిన జనం..
తిరుమలలోని వీఐపీ కాటేజీలో అనుకోని అతిథి.. పరుగులు తీసిన జనం..