AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ రాజకీయాల్లోకి చిరును ఎందుకు లాగుతారు: ప్రముఖ నిర్మాత ఫైర్

ఎన్నికల తేది సమీపిస్తోన్న వేళ ఏపీలో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి అన్ని పార్టీలు. ఒకరి వైఫల్యాలను మరొకరు ఎండగడుతూ ప్రచారాల్లో పోటీ పడుతున్నారు అభ్యర్థులు. అయితే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కామెంట్లు చేశారు. దీంతో ఏపీ ఎన్నికల వేడి కాస్త తెలంగాణాకు అంటుకుంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌పై కామెంట్లు చేస్తోన్న కొంతమంది ఈ వివాదంలోకి ఆయన సోదరుడు చిరంజీవిని కూడా లాగుతున్నారు. దీనిపై ప్రముఖ […]

మీ రాజకీయాల్లోకి చిరును ఎందుకు లాగుతారు: ప్రముఖ నిర్మాత ఫైర్
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 26, 2019 | 9:03 AM

Share

ఎన్నికల తేది సమీపిస్తోన్న వేళ ఏపీలో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి అన్ని పార్టీలు. ఒకరి వైఫల్యాలను మరొకరు ఎండగడుతూ ప్రచారాల్లో పోటీ పడుతున్నారు అభ్యర్థులు. అయితే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కామెంట్లు చేశారు. దీంతో ఏపీ ఎన్నికల వేడి కాస్త తెలంగాణాకు అంటుకుంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌పై కామెంట్లు చేస్తోన్న కొంతమంది ఈ వివాదంలోకి ఆయన సోదరుడు చిరంజీవిని కూడా లాగుతున్నారు. దీనిపై ప్రముఖ నిర్మాత, చిరు సన్నిహితుడు ఠాగూర్ మధు ఫైర్ అయ్యారు.

ఈ మేరకు ట్విట్టర్‌లో మధు ఓ ట్వీట్ చేశారు. ‘‘మీ రాజకీయాలు మీరు చేసుకోండి. క్రమశిక్షణకు మారుపేరైన మెగాస్టార్‌ను ఎందుకు లాగుతారు. మౌనంగా ఉన్న కేసీఆర్ ఊసేందుకు. భావ వ్యక్తీకరణ మాత్రమే కాదు భాష కూడా ముఖ్యం’’ అని మర్చిపోకండి అంటూ ఆయన కామెంట్ చేశారు. ఇక ఈ వ్యాఖ్యలు పవన్ కల్యాణ్‌ కూడా వర్తిస్తాయంటూ ఆయన పరోక్షంగా చెప్పారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే సినిమాలలో రీ ఎంట్రీ ఇచ్చిన  చిరంజీవి గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలనుకుంటోన్న చిరు, ‘సైరా’ షూటింగ్ పేరుతో చైనాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Follow Us
పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్మునే దోచేస్తున్నారు
పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్మునే దోచేస్తున్నారు
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలకు షాక్.. భారీగా ఎక్స్‌పైరీ ఫుడ్ సీజ్!
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలకు షాక్.. భారీగా ఎక్స్‌పైరీ ఫుడ్ సీజ్!
ఇట్స్ అఫీషియల్.. OTTలో సూర్య బ్లాక్ బస్టర్ 'విశ్వనాథ్ అండ్ సన్స్'
ఇట్స్ అఫీషియల్.. OTTలో సూర్య బ్లాక్ బస్టర్ 'విశ్వనాథ్ అండ్ సన్స్'
అర్థరాత్రి మరిన్ని రూట్లలో నైట్ షిఫ్ట్ బస్సు సర్వీసులు..
అర్థరాత్రి మరిన్ని రూట్లలో నైట్ షిఫ్ట్ బస్సు సర్వీసులు..
చికెన్ బిర్యానీని కుక్కర్‌లో ఇలా చేస్తే అద్భుతం అంతే...
చికెన్ బిర్యానీని కుక్కర్‌లో ఇలా చేస్తే అద్భుతం అంతే...
మహిళల్లో గుండెపోటు తీవ్ర సంకేతాలు..ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
మహిళల్లో గుండెపోటు తీవ్ర సంకేతాలు..ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
ఒకే బ్రాండ్.. రెండు న్యాయాలా? ఫాంటాలో 3 స్పూన్ల చక్కెర..!
ఒకే బ్రాండ్.. రెండు న్యాయాలా? ఫాంటాలో 3 స్పూన్ల చక్కెర..!
తక్కువ సమయంలో మీ ఒంటికి ఎక్కువ రక్తం పట్టాలా..ఈ లడ్డూ తినాల్సిందే
తక్కువ సమయంలో మీ ఒంటికి ఎక్కువ రక్తం పట్టాలా..ఈ లడ్డూ తినాల్సిందే
ఖాతాలో డబ్బు ఉందా? ఇలా చేస్తే భారీగా వడ్డీ వస్తుందని తెలుసా?
ఖాతాలో డబ్బు ఉందా? ఇలా చేస్తే భారీగా వడ్డీ వస్తుందని తెలుసా?
ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తీర్మానం
ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తీర్మానం