AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెల్‌బోర్న్‌లో ప్రధాని మోదీ క్రికెట్ దౌత్యం.. స్టీవ్ వాకు 20 ఏళ్ల నాటి అరుదైన కానుక..!

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్రికెట్ దౌత్యంతో ఇరు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేశారు. తన మూడు రోజుల పర్యటనలో చివరి రోజైన శుక్రవారం (జూలై 10), ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్ వాకు ఒక అపురూపమైన, అరుదైన బహుమతిని అందజేశారు.

మెల్‌బోర్న్‌లో ప్రధాని మోదీ క్రికెట్ దౌత్యం..  స్టీవ్ వాకు 20 ఏళ్ల నాటి అరుదైన కానుక..!
Pm Modi Gifted Steve Waugh
Balaraju Goud
|

Updated on: Jul 10, 2026 | 3:52 PM

Share

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్రికెట్ దౌత్యంతో ఇరు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేశారు. తన మూడు రోజుల పర్యటనలో చివరి రోజైన శుక్రవారం (జూలై 10), ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్ వాకు ఒక అపురూపమైన, అరుదైన బహుమతిని అందజేశారు. సుమారు 20 ఏళ్ల క్రితం మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్టీవ్ వా ఆయనను కలిసినప్పటి ఒక పాత ఫోటోను ప్రధాని ఈ సందర్భంగా బహుమతిగా ఇచ్చారు. రెండు దశాబ్దాల నాటి ఈ ప్రత్యేక జ్ఞాపకం ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేయగా.. ఈ అరుదైన కానుక పట్ల స్టీవ్ వా తీవ్ర హర్షం వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ పర్యటన వేళ క్రీడా రంగంలో ఒక చారిత్రాత్మక ప్రకటన వెలువడింది. ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ (BBL) 2026-27 సీజన్ ఆరంభ మ్యాచ్ ఈ ఏడాది డిసెంబర్‌లో భారతదేశంలోని చెన్నై వేదికగా జరగనుందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ అధికారికంగా ప్రకటించారు. ఆస్ట్రేలియా వెలుపల ఒక అధికారిక BBL మ్యాచ్ జరగడం చరిత్రలో ఇదే తొలిసారి. భారత్ ఇంతకుముందు ఐపీఎల్ వంటి అనేక అంతర్జాతీయ లీగ్‌లకు ఆతిథ్యం ఇచ్చినప్పటికీ, ఒక విదేశీ దేశీయ క్రికెట్ లీగ్ భారత గడ్డపై అధికారిక మ్యాచ్‌ను నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ ప్రారంభ మ్యాచ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్, పెర్త్ స్కార్చర్స్ జట్లు తలపడతాయని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది.

ఎంసిజి (MCG) వేదికగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ మైదానంలోకి అడుగుపెట్టడం ఏ భారతీయుడికైనా ఒకేసారి రెండు భావోద్వేగాలను కలిగిస్తుందని అన్నారు. ఒకటి భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ ఉత్సాహం అయితే, రెండవది మన రెండు దేశాలలో క్రికెట్ కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు, అది ఒక ఉమ్మడి అభిరుచి అనే గ్రహింపు అని స్పష్టం చేశారు. ఈ రోజు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆటలోని ఆనందం, ఇరు దేశాల స్నేహంలోని ఆత్మీయత మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నాయని మోదీ పేర్కొన్నారు.

ఇదిలావుంటే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మద్దతుతో, చెన్నై మ్యాచ్‌ను ఒకే ఒక్క ప్రత్యేక ఈవెంట్‌గా ప్లాన్ చేశారు. 2030 వరకు జియోస్టార్‌తో కుదిరిన మీడియా హక్కుల ఒప్పందం ద్వారా బిబిఎల్ ఇప్పటికే భారతదేశంలో ప్రసారం అవుతుండగా.. తాజా నిర్ణయంతో ఈ ప్రాంతం నుండి బాహ్య పెట్టుబడులను ఆకర్షించే అవకాశాన్ని కూడా క్రికెట్ ఆస్ట్రేలియా అన్వేషిస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us