Chidambaram Tweet: ప్రధానిపై నా వ్యాఖ్యలు తప్పు.. నేను ఉపసంహరించుకుంటున్నాను..కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం ట్వీట్
Chidambaram Tweet: టీకా విధానంలో కేంద్ర ప్రభుత్వం మార్పులను చేయడం విషయంలో ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం ఈ రోజు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.
Chidambaram Tweet: టీకా విధానంలో కేంద్ర ప్రభుత్వం మార్పులను చేయడం విషయంలో ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం ఈ రోజు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. కొరోనావైరస్ టీకా కార్యక్రమంపై కేంద్రం తిరిగి తన నియంత్రణలోకి తీసుకుంటుందని పిఎం మోడీ సోమవారం చెప్పారు. రాష్ట్రాలు తమ వైఖరిని ఇటీవల మార్చుకోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. అయితే, ప్రధాని ఈ వ్యాఖ్యలు అబద్ధమని చిదంబరం అబద్ధమని పేర్కొన్నారు. తాను చేసిన తప్పులకు ప్రతిపక్షాలను ప్రధాని నిందించారని చిదంబరం సోమవారం వార్తా సంస్థ ANI కి చెప్పారు. అంతే కాకుండా “ఎవరూ, కానీ కేంద్రం టీకాలు సేకరించకూడదని ఎవ్వరూ చెప్పలేదు. ఆయన (పిఎం) ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను నిందించారు – వారు టీకాలు సేకరించాలని కోరుకున్నారు. అందువల్ల మేము వాటిని అనుమతించాము. అని ప్రధాని చెప్పారు. కానీ ఏ ముఖ్యమంత్రి , ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ తేదీన ఈడిమాండ్ చేశారో మాకు తెలియజేయండి.” అంటూ ఆయన ప్రధానిని సవాల్ చేశారు. ఇప్పుడు తాజాగా తాను పొరబాటు పడినట్లు చిదంబరం అంగీకరించారు. నేను నా తప్పును సరిదిద్దుకున్నాను అంటూ ఆయన ట్వీట్ చేశారు. తన ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.
“నేను ANI కి చెప్పాను, దయచేసి టీకాలను నేరుగా సేకరించడానికి అనుమతించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం కోరిందో మాకు చెప్పండి.” పశ్చిమ బెంగాల్ సిఎం రాసిన లేఖ కాపీని సోషల్ మీడియా కార్యకర్తలు ప్రధానికి పోస్ట్ చేశారు. నేను తప్పు చేశాను. నేను సరిదిద్దుకున్నాను “అని గత రాత్రి ఆయన తన ట్వీట్ లో రాశారు. చిదంబరం చేసిన ట్వీట్ ఇక్కడ చూడొచ్చు.
I told ANI ‘please tell us which state government demanded that it should be allowed to directly procure vaccines’
Social media activists have posted the copy of the letter of CM, West Bengal to PM making such a request.
I was wrong. I stand corrected.
— P. Chidambaram (@PChidambaram_IN) June 7, 2021
అసలు ఏం జరిగింది..
సోమవారం ప్రధాని టీకాపై ప్రకటన చేయగానే చిదంబరం స్పందిస్తూ ప్రభుత్వాన్ని విమర్శించారు. చిదంబరం ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే 021 ఫిబ్రవరి 24 నాటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాసిన లేఖ ట్విట్టర్‌లో ప్రసారం కావడం ప్రారంభమైంది. “పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం టీకాలు ఉచితంగా అందించాలని కోరుకుంటున్నందున రాష్ట్ర ప్రభుత్వం టీకాలు వేసిన పాయింట్ (ల) నుండి అధిక ప్రాధాన్యత ఆధారంగా కొనుగోలు చేయగలిగేలా ఈ విషయాన్ని దయతో అంగీకరించాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము” అని ఆమె ఆ లేఖలో ప్రధానిని ఉద్దేశించి రాశారు. ఎప్పుడైతే ఈ లేఖ ట్విట్టర్ లో చక్కర్లు కొట్టడం మొదలు పెట్టిందో వెంటనే చిదంబరం తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. కేంద్ర పభుత్వం పై, ప్రధానిపై తను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ఆయన తన ట్వీట్ లో తెలిపారు.
Also Read: Suvendu Adhikari: ఢిల్లీలో బెంగాల్ రాజకీయం.. అమిత్‌షాతో సువేందు అధికారి మంత్రాంగం
గత్యంతరం లేక ఈ నిర్ణయం..! స్వాగతమిస్తూనే చురకలంటించిన విపక్షాలు.కేంద్రం ఫ్రీ వాక్సిన్ పై స్పందన..