Bandi Sanjay: కరీంనగర్‌లో హై టెన్షన్.. బండి సంజయ్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు..
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు పోలీసులపై దాడి, విధులకు ఆటంకం, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కరీంనగర్ టూటౌన్ పీఎస్‌లో బండి సంజయ్‌పై..

BJP – Bandi Sanjay: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీసులపై దాడి, విధులకు ఆటంకం, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కరీంనగర్ టూటౌన్ పీఎస్‌లో కేసులు పెట్టారు. ఆయతో పాటు మరో 12 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదైందు చేశారు. రాష్ట్రంలో ధర్నాలు, దీక్షలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. ప్రభుత్వం, కోర్టు ఆదేశాలను బండి సంజయ్ పాటించలేదన్న కరీంనగర్ సీపీ సత్యనారాయణ.. కోర్టు ఆదేశాలు అమలుచేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. పోలీసుల నోటీస్‌ను బండి సంజయ్ పట్టించుకోలేంటున్నారు సత్యనారాయణ.
బండి సంజయ్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆ తర్వాత అరెస్ట్ చేసి.. దీక్ష చేస్తున్న క్యాంప్ కార్యాలయం నుంచి తరలించారు. తమ దీక్షను అడ్డుకుని తన క్యాంప్ ఆఫీస్‌కు వచ్చి దాడి చేసే పర్మిషన్ ఎవరిచ్చారని అంతకు ముందు బండి సంజయ్ పోలీసులను ప్రశ్నించారు.
గ్యాస్‌కట్టర్లతో క్యాంప్ ఆఫీస్ తలుపులు కట్ చేసి తెరిచారు పోలీసులు. ఈ క్రమంలో కొద్దిసేపు హైడ్రామా నడిచింది. బండి సంజయ్ దీక్షను భగ్నం చేసేందుకు వచ్చిన పోలీసులను కార్యకర్తలు అడ్డుకున్నారు. తలుపులకు కుర్చీలు, బెంచీలు అడ్డుపెట్టి పోలీసులను రానివ్వకుండా చేశారు. అయితే పోలీస్ ఫోర్సుతో వచ్చి.. బండి సంజయ్ దీక్షను భగ్నం చేశారు. ఈనెల 10 వరకు సభలు, సమావేశాలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు.
బండి సంజయ్‌ని బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కోవిడ్ ప్రోటోకాల్స్ కేసులో అరెస్ట్ చేశారు. వెంటనే మానుకొండూరు స్టేషన్‌కు తరలించారు. అక్కడే దీక్షకు దిగారు బండి సంజయ్. ప్రభుత్వం 317 జీవోపై దిగిరావాలని అన్నారాయన.
బండిసంజయ్ దీక్ష భగ్నంపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. పోలీసుల దాడిని ఖండిస్తున్నానన్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరున్ చుగ్. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాల్లో భాగంగానే ఈ దాడి చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. డీకే అరుణ ఘటనను ఖండించారు.
బండి సంజయ్‌ని అరెస్ట్ చేయడం దారుణం అని ఆ పార్టీ జాతీయ అక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ఇది అమానవీయ ఘటన అంటూ పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నవారిపై పోలీసులు లాఠీచార్జీ ఎందుకు చేశారో ప్రభుత్వ చెప్పాలని తన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
कल रात @BJP4Telangana के प्रदेश अध्यक्ष @bandisanjay_bjp जी के साथ तेलंगाना की केसीआर सरकार ने जिस अमानवीय तरीके से मारपीट की, कार्यकर्ताओं पर लाठीचार्ज किया और उन्हें गिरफ्तार किया, वह दुःखद एवं निंदनीय है। यह लोकतंत्र की हत्या है। हम इस कुत्सित प्रयास की कड़ी भर्त्सना करते हैं। pic.twitter.com/CE66azMLPj
— Jagat Prakash Nadda (@JPNadda) January 3, 2022
పోలీసుల తీరును తప్పుబట్టారు బీజేపీ నేతలు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్. దీక్షకు వస్తుంటే తమను కూడా అడ్డుకున్నారన్నారు రాజాసింగ్. ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు.