కాంగ్రెస్ పార్టీలో విలీనం ప్రసక్తే లేదు..పవార్
కాంగ్రెస్ పార్టీలో తాము విలీనమయ్యే ప్రసక్తే లేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొత్తు పెట్టుకున్నప్పటికీ.. మరిన్ని అసెంబ్లీ సీట్లకోసం పట్టు పడతామన్నారు. కనీసం 50 శాతం స్థానాలను తాము కోరే అవకాశం ఉందని ఈ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. పవార్ అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో 144 సీట్లకు తమ పార్టీ పోటీ చేయవచ్ఛునని చెప్పారు. కాగా-1999 […]
కాంగ్రెస్ పార్టీలో తాము విలీనమయ్యే ప్రసక్తే లేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొత్తు పెట్టుకున్నప్పటికీ.. మరిన్ని అసెంబ్లీ సీట్లకోసం పట్టు పడతామన్నారు. కనీసం 50 శాతం స్థానాలను తాము కోరే అవకాశం ఉందని ఈ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. పవార్ అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో 144 సీట్లకు తమ పార్టీ పోటీ చేయవచ్ఛునని చెప్పారు. కాగా-1999 లో పవార్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. అప్పట్లో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ విదేశీ పుట్టుక, ప్రధాని పదవికి ఆమె అభ్యర్థిత్వం వంటి అంశాల కారణంగా పవార్ ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు. అంతకుముందు 1986 లో ఆయన…. రాజీవ్ గాంధీ క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అత్యంత ‘ చేదోడు-వాదోడు ‘ గా ఉండి… తాను కాంగ్రెస్ మనిషినని అనిపించుకున్నారు. ఆ తరువాత మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తానే సొంతంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి మహారాష్ట్రలో కాంగ్రెస్ కి గట్టి సవాల్ విసిరారు. కేంద్రంలో నాడు మంత్రి పదవిని చేబడుతూనే మరో వైపు రాష్ట్రంలోనూ ఆయన తన పట్టు కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్సీపీ విలీనం కావచ్ఛునని వస్తున్న వార్తలకు పవార్ ఇలా ఫుల్ స్టాప్ పెట్టేశారు.