ముక్కలైన ‘ మహాకూటమి ‘ ? ఎస్పీతో మాయావతి కటీఫ్ !

యూపీలో ఇదో సరికొత్త రాజకీయ పరిణామం. ఒకప్పుడు ప్రత్యర్థులుగా ఉండి , ఇటీవలి ఎన్నికల్లో మళ్ళీ మిత్రులైన రెండు ప్రధాన పార్టీలు చెరో దారి పడుతున్నాయి. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇక ఆ పార్టీకి రామ్ రామ్ చెప్పారు. తామిక ఎస్పీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని సోమవారం ప్రకటించారు. యూపీలో 11 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉపఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. […]

ముక్కలైన ' మహాకూటమి ' ? ఎస్పీతో మాయావతి కటీఫ్ !
Pardhasaradhi Peri

|

Jun 03, 2019 | 6:24 PM

యూపీలో ఇదో సరికొత్త రాజకీయ పరిణామం. ఒకప్పుడు ప్రత్యర్థులుగా ఉండి , ఇటీవలి ఎన్నికల్లో మళ్ళీ మిత్రులైన రెండు ప్రధాన పార్టీలు చెరో దారి పడుతున్నాయి. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇక ఆ పార్టీకి రామ్ రామ్ చెప్పారు. తామిక ఎస్పీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని సోమవారం ప్రకటించారు. యూపీలో 11 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉపఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. పొత్తులపై మేమిక ఆధారపడం.. అలయెన్స్ వల్ల ప్రయోజనం లేదని గుర్తించాం.. తాజా ఎన్నికల్లో యాదవుల ఓట్లు మన పార్టీకి (బీఎస్పీ) కి పడకపోగా.. మన పార్టీ ఓట్లు వాళ్లకు (ఎస్పీ) కి పడ్డాయి. ముస్లిముల ఓట్లే అఖిలేష్ పార్టీకి పడినట్టు కూడా తేలింది. అని ఆమె పేర్కొన్నారు. యాదవుల ఓట్లను బీఎస్పీ పొందలేకపోయిందని ఆమె చెప్పారు. మహాకూటమి ‘ మాయ ‘ లో తాము పడే అవకాశంలేదని చెప్పిన మాయావతి.. 1995 లో యూపీలోని గెస్ట్ హౌస్ లో సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు తనపై చేసిన దాడిని గుర్తు చేశారు. బీజేపీకి చేరువవుతున్నామనే కారణంపై వారు తనను టార్గెట్ చేశారని, అయితే దేశ, శ్రేయస్సు దృష్ట్యా తాము మళ్ళీ సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని అన్నారు. అఖిలేష్ ని మాయావతి ‘ కుర్రాడు ‘ గా అభివర్ణించారు. ఆయన తన భార్య డింపుల్ ని, తన కజిన్లయిన అక్షయ్, ధర్మేంద్ర యాదవ్ లను కూడా గెలిపించుకోలేకపోయాడని ఆమె అన్నారు. యాదవుల కుటుంబంలో రేగిన వివాదాల్లో మనమెందుకు జోక్యం చేసుకోవాలని ఆమె తన పార్టీ కార్యకర్తలను ప్రశ్నించారు. మాయావతి తాజా నిర్ణయంతో ఇక విపక్షాల ‘ మహాకూటమి ‘ కి గండి పడినట్టేనని భావిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ…. యూపీలో తగినన్ని మెజారిటీ సీట్లను గెలుచుకుని బీఎస్పీ, ఎస్పీ కూటమిని చావుదెబ్బ తీసింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu