రేపే ఏపీ ఎంసెట్‌ ఫలితాలు

అమరావతి: ఏపీ ఎంసెట్‌ – 2019 ఫలితాల విడుదలకు తేదీ ఖరారైంది. ఈ ఫలితాలను రేపు విడుదల చేయనున్నారు. ప్రభుత్వ అనుమతితో ఈ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ ఇంటర్‌ మార్కుల్లో నెలకొన్న గందరగోళం కారణంగా ఎంసెట్‌ ఫలితాల్లో జాప్యం జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణకు చెందిన 36వేల మందికి పైగా విద్యార్థులు ఏపీ ఎంసెట్‌ రాశారు. వీరికి ర్యాంకులు కేటాయించేందుకు ఇంటర్‌ మార్కులు అవసరం కానున్నాయి. ఇంటర్‌ మార్కులకు ఎంసెట్‌లో 25% […]

రేపే ఏపీ ఎంసెట్‌ ఫలితాలు
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 03, 2019 | 8:55 PM

అమరావతి: ఏపీ ఎంసెట్‌ – 2019 ఫలితాల విడుదలకు తేదీ ఖరారైంది. ఈ ఫలితాలను రేపు విడుదల చేయనున్నారు. ప్రభుత్వ అనుమతితో ఈ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ ఇంటర్‌ మార్కుల్లో నెలకొన్న గందరగోళం కారణంగా ఎంసెట్‌ ఫలితాల్లో జాప్యం జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణకు చెందిన 36వేల మందికి పైగా విద్యార్థులు ఏపీ ఎంసెట్‌ రాశారు. వీరికి ర్యాంకులు కేటాయించేందుకు ఇంటర్‌ మార్కులు అవసరం కానున్నాయి. ఇంటర్‌ మార్కులకు ఎంసెట్‌లో 25% వెయిటేజీ ఉంది. మొత్తం 2,82,901 మంది విద్యార్థులు ఎంసెట్‌ పరీక్ష రాశారు. ఇంజినీరింగ్‌ పరీక్షకు 1,85,711 మంది హాజరు కాగా.. వ్యవసాయ, వైద్య విద్య పరీక్షకు 81,916మంది హాజరయ్యారు.