శరద్‍పవార్ అనూహ్య నిర్ణయం

లోక్ సభ ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీచేయడం లేదని ప్రకటించారు. 14 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని.. ఇక విశ్రాంతి తీసుకుంటానని సోమవారం (మార్చి 11) మీడియాకు ఆయన తెలిపారు. అయితే తమ కుటుంబం నుంచి ఇద్దరు సభ్యులు పోటీ చేస్తారని వెల్లడించారు. తన కుమార్తె సుప్రియా సూలే, మనవడు పార్థ పవార్ లోక్‌సభ బరిలోకి […]

శరద్‍పవార్ అనూహ్య నిర్ణయం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 11, 2019 | 6:27 PM

లోక్ సభ ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీచేయడం లేదని ప్రకటించారు. 14 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని.. ఇక విశ్రాంతి తీసుకుంటానని సోమవారం (మార్చి 11) మీడియాకు ఆయన తెలిపారు. అయితే తమ కుటుంబం నుంచి ఇద్దరు సభ్యులు పోటీ చేస్తారని వెల్లడించారు.

తన కుమార్తె సుప్రియా సూలే, మనవడు పార్థ పవార్ లోక్‌సభ బరిలోకి దిగుతున్నారని శరద్ పవార్ తెలిపారు. 2014 సాధారణ ఎన్నికల్లోనూ పవార్ పోటీ చేయలేదు. అందువల్ల ఈసారి ఖ‌చ్చితంగా పోటీ చేస్తారని పార్టీ నేతలు, కార్యకర్తలు భావించారు. ఈ నేపథ్యంలో ఆయన అనూహ్య నిర్ణయం ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

మహారాష్ట్రలోని మాధ లోక్ సభ నియోజకవర్గం నుంచి శరద్ పవార్ పలుమార్లు పోటీచేసి గెలిచారు. ఈ స్థానం నుంచి పార్టీ (ఎన్‌సీపీ) నేత విజయ్ సింగ్ మోహిత్ పాటిల్ బరిలో నిలిచే అవకాశాలున్నాయి. పుణే జిల్లాలోని కీలకమైన మావల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి తన మేనల్లుడు, పార్టీ కీలక నేత అజిత్ పవార్ కుమారుడు బరిలో దిగనున్నట్లు శరద్ పవార్ సంకేతాలిచ్చారు.