నర్సాపురం నుంచి ఎంపీ బరిలో నాగబాబు..!

మెగా బ్రదర్, సినీ నటుడు నాగబాబు రాజకీయాల్లోకి రానున్నారు. తన తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేనలోకి వెళ్లనున్న ఆయన.. నర్సాపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పవన్‌ను ఇటీవల కలిసిన నాగబాబు ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో ఈ స్థానం నుంచి జనసేన తరపున కారటం రాంబాబు పోటీ చేస్తారని వార్తలు వచ్చినా.. ఇప్పుడు ఆ స్థానం తన సోదరుడికి ఇచ్చేందుకే పవన్ సముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆ […]

  • Updated On - 11:34 am, Wed, 13 March 19 Edited By:
నర్సాపురం నుంచి ఎంపీ బరిలో నాగబాబు..!

మెగా బ్రదర్, సినీ నటుడు నాగబాబు రాజకీయాల్లోకి రానున్నారు. తన తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేనలోకి వెళ్లనున్న ఆయన.. నర్సాపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పవన్‌ను ఇటీవల కలిసిన నాగబాబు ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో ఈ స్థానం నుంచి జనసేన తరపున కారటం రాంబాబు పోటీ చేస్తారని వార్తలు వచ్చినా.. ఇప్పుడు ఆ స్థానం తన సోదరుడికి ఇచ్చేందుకే పవన్ సముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆ నియోజకవర్గంలో జనసేన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుండగా.. అందుకోసం నాగబాబును పవన్ బరిలోకి దింపనున్నారని టాక్.

ఇదిలా ఉంటే జనసేనను ఏర్పాటు చేసిన తరువాత తొలిసారిగా ఆ పార్టీ తరపున అభ్యర్థులను బరిలోకి దింపబోతున్నారు పవన్ కల్యాణ్. ఇందుకోసం కొంతమంది అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసినట్లు సమాచారం. కాగా ఏప్రిల్ 11న ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. రోజురోజుకు మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోనని అందరిలో ఆసక్తి నెలకొంది.