వైసీపీపై బాలకృష్ణ ఫైర్

వైసీపీపై బాలకృష్ణ ఫైర్

హిందూపురం: హత్యారాజకీయాలు చేయడం వైసీపీకి అలవాటేనని సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం సూగురు ఆంజనేయస్వామి ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. రేపు హిందుపూరంలో ఎమ్మెల్యే అభ్యర్ధిగా బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పూజలు నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీకి కాకుండా ఏ పార్టీకి ఓటేసినా అది బీజేపీ ఖాతాలోకే వెళుతుందని అన్నారు. హిందూపురం నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని చెప్పారు. […]

Vijay K

|

Mar 22, 2019 | 11:04 AM

హిందూపురం: హత్యారాజకీయాలు చేయడం వైసీపీకి అలవాటేనని సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం సూగురు ఆంజనేయస్వామి ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. రేపు హిందుపూరంలో ఎమ్మెల్యే అభ్యర్ధిగా బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

ఈ నేపథ్యంలో పూజలు నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీకి కాకుండా ఏ పార్టీకి ఓటేసినా అది బీజేపీ ఖాతాలోకే వెళుతుందని అన్నారు. హిందూపురం నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని చెప్పారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో స్పందించమని విలేకర్లు కోరగా హత్యారాజకీయాలు చేయడం ఆ పార్టీకి అలవాటే అని బాలకృష్ణ అన్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu