సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఇండస్ట్రియల్ పాలసీ.. పరిశ్రమల శాఖపై సమీక్షలో మంత్రి మేకపాటి
ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ఉననతాధికారులతో..

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ఉననతాధికారులతో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల పై ఉన్నతాధికారులతో చర్చించారు.
ఈడీబీలో ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అందుకోవడంలో మరింత మెరుగ్గా పని చేయాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. పరిశ్రమ పెట్టాలనుకునే సామాన్య మనుషులకు కూడా అనువైన విధానాలను అందుబాటులోకి తేవాలని సూచించారు. పరిశ్రమల స్థాపనతో పాటే నైపుణ్యం, ఉపాధి కల్పనపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు.
ఈ సమావేశానికి పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీఐఐసీ ఎండీ రవీన్ కుమార్ రెడ్డి, ఏపీఐఐసీ ఈడీ ప్రతాప్ రెడ్డి, ఏపీ హై గ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ ఎండీ షన్ మోహన్, జాయింట్ డైరెక్టర్ ఇందిరా, పరిశ్రమల శాఖ సలహాదారులు కృష్ణ జి.వి గిరి, శ్రీధర్ లంకా ,పరిశ్రమల శాఖ అధికారులు, ఈడీబీ అధికారులు హాజరయ్యారు.
Read more: