నోముల పేద‌ల ప‌క్ష‌పాతి.. శాసనసభలో న‌ర్సింహ‌య్య‌ సంతాప తీర్మానంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు ‌

‌మ్యూనిస్టుగా జీవితాన్ని ప్రారంభించి, తెలంగాణ ఉద్య‌మ స్ఫూర్తితో టిఆర్ఎస్ లో చేరి, త‌న జీవిత కాలం మొత్తం పేద‌ల కోసం ప‌ని చేసిన నేత‌గా నోముల న‌ర్సింహ‌య్య‌ను..

నోముల పేద‌ల ప‌క్ష‌పాతి.. శాసనసభలో న‌ర్సింహ‌య్య‌ సంతాప తీర్మానంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు ‌
Errabelli
Follow us

|

Updated on: Mar 16, 2021 | 1:30 PM

నోముల న‌ర్సింహ‌య్య పేద‌ల ప‌క్ష‌పాతి. త‌న జీవితాంతం పేద ప్రజల కోసం పోరాటం చేసిన ప్ర‌జా నాయ‌కుడ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభి‌వృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి త‌న రాజకీయ జీవితాన్ని అంకితమిచ్చిన నేతని ఆయన కొనియాడారు. మంగళవారం రాష్ట్ర శాసనసభ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన దివంగత నోముల నరసింహ్మయ్య సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడారు.

క‌మ్యూనిస్టుగా జీవితాన్ని ప్రారంభించి, తెలంగాణ ఉద్య‌మ స్ఫూర్తితో టిఆర్ఎస్ లో చేరి, త‌న జీవిత కాలం మొత్తం పేద‌ల కోసం ప‌ని చేసిన నేత‌గా నోముల న‌ర్సింహ‌య్య‌ను ఎర్ర‌బెల్లి పేర్కొన్నారు. నాటి సీనియ‌ర్ ఎమ్మెల్యే న‌ర్రా రాఘ‌వ‌రెడ్డి శిష్యుడిగా, రాజ‌కీయ ప్ర‌వేశం చేసి, అనేక ప్ర‌జా ఉద్య‌మాల్లో పాల్గొన్నారు. లాయ‌ర్ గా కూడా పేద‌ల కేసుల‌ను వాదించి పేరు తెచ్చుకున్నారు. వ‌రంగ‌ల్ ఆడ బిడ్డ‌ను పెండ్లి చేసుకున్నారు. అని నోముల‌తో త‌న‌కున్న ప‌రిచ‌యాన్ని మంత్రి ఎర్ర‌బెల్లి నెమ‌రు వేసుకున్నారు.

అనేక విష‌యాల్లో తాను నోముల క‌లిసి ప‌ని చేశామ‌న్నారు. అసెంబ్లీలో నోముల త‌న గురువు లాగే అద్భుతంగా మాట్లాడేవార‌న్నారు. మంచ వాక్ప‌టిమ గ‌ల నేత‌గా చెప్పారు. అలాంటి నేత మ‌ర‌ణం అత్యంత బాధాక‌ర‌మ‌ని, వారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, వారి కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.

కొత్త నేతలకు నోముల ఆదర్శం -మంత్రి వేముల నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి పట్ల మంగళవారం శాసనసభలో జరిగిన సంతాప తీర్మానంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రసంగించారు. కొత్తగా వచ్చిన రాజకీయ నాయకులు నోముల నర్సింహయ్యను ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి సూచించారు.

ప్రభుత్వాన్ని విమర్శించడంలో కూడా హుందాతనం ఉండేది. తనదైన శైలిలో ప్రజా సమస్యలపై అప్పటి ప్రభుత్వాలను విమర్శించేవారని అన్నారు. చివరి శ్వాస వరకు పేద ప్రజల కోసం పనిచేసిన గొప్ప నాయకుడు.ఆయన మనమధ్య లేకపోవడం బాధాకరమని వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..