సాధ్వి టార్గెట్‌.. పాత కేసు తిరగదోడే పనిలో ఎంపీ సర్కార్

భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌పై ఉన్న ఓ పాత కేసును తిరగదోడే ఆలోచనలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఉంది. 2007లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ సునీల్ జోషి హత్యకు సంబంధించిన కేసులో.. సాధ్వి నిందితురాలిగా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి లీగల్ ఓపీనియన్ తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సునీల్ జోషి హత్య కేసులో సాధ్వి ప్రజ్ఞా సింగ్‌తో పాటు.. మరో ఏడుగురు నిందితులకు 2017లో దేవాస్ కోర్టు ఊరటనిచ్చింది. ఏళ్ల తరబడి సాగిన […]

సాధ్వి టార్గెట్‌.. పాత కేసు తిరగదోడే పనిలో ఎంపీ సర్కార్
Follow us

| Edited By:

Updated on: May 21, 2019 | 9:22 PM

భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌పై ఉన్న ఓ పాత కేసును తిరగదోడే ఆలోచనలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఉంది. 2007లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ సునీల్ జోషి హత్యకు సంబంధించిన కేసులో.. సాధ్వి నిందితురాలిగా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి లీగల్ ఓపీనియన్ తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సునీల్ జోషి హత్య కేసులో సాధ్వి ప్రజ్ఞా సింగ్‌తో పాటు.. మరో ఏడుగురు నిందితులకు 2017లో దేవాస్ కోర్టు ఊరటనిచ్చింది. ఏళ్ల తరబడి సాగిన ఈ కేసులో తీర్పు వెలువడిన తర్వాత ఈ ఎనిమిది మందికి విముక్తి లభించింది. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అయిన జోషిని బైకు మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్చిచంపారు. ఇందుకు సంబంధించి సాధ్వి, వాయుదేవ్ పర్మార్, ఆనంద్ రాజ్ కటారియా, హర్షద్ సోలంగి,లోకేష్ శర్మ, రాజేంద్ర చౌదరి, రామ్ చంద్ర పటేల్, జితేంద్ర శర్మలపై ఐపీసీ 120 (బి), 302 (హత్య) కేసులు నమోదు చేశారు. అయితే సరైన సాక్ష్యాధారులు లేకపోవడంతో మధ్యప్రదేశ్ పోలీసులు కేసును మూసేశారు. ఆ తర్వాత కేసును తొలుత ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు, ఆ తర్వాత దేవాస్ సెషన్స్ కోర్టుకు బదలీ చేశారు.

కాగా, 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలైన సాధ్వి ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. ఈ ఏడాది మొదట్లో బీజేపీలో చేరిన ఆమె భోపాల్ అభ్యర్థిగా పార్టీ టిక్కెట్ పొంది.. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై నిలబడారు.

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..