పార్టీపై పట్టు బిగించిన కేటీఆర్!

పార్టీపై పట్టు బిగించిన కేటీఆర్!
Ktr latest moves

సీఎం కేసీఆర్ ఇన్ని రోజులు మంత్రివర్గ విస్తరణ ఆపడానికి ప్రధాన కారణమదే. అసంతృప్తులు. పక్క పార్టీల నుంచి భారీగా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం..ముందు నుంచి పార్టీ కోసం పనిచేసినవారు..ఎన్నికల సమయంలో సర్దుబాట్ల కోసం ఎమ్మెల్సీ కోటాలో హామిలు..ఇవన్నీ కేసీఆర్‌కు విస్తరణ చేసేందుకు చాలా టైం తీసుకునేలా చేశాయి. మొత్తానికి ఆ ఘట్టం ముగిసింది.  తమకు మంత్రివర్గంలో అవకాశం రాలేదని సీనియర్ నాయకులు వరుసగా విమర్శల వర్షం కురిపించారు. ముందురోజు ఎంతైతే నిరసన గళం వినిపించారో..నెక్ట్స్ డే అంతగా మళ్ళీ […]

Ram Naramaneni

|

Sep 14, 2019 | 6:28 AM

సీఎం కేసీఆర్ ఇన్ని రోజులు మంత్రివర్గ విస్తరణ ఆపడానికి ప్రధాన కారణమదే. అసంతృప్తులు. పక్క పార్టీల నుంచి భారీగా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం..ముందు నుంచి పార్టీ కోసం పనిచేసినవారు..ఎన్నికల సమయంలో సర్దుబాట్ల కోసం ఎమ్మెల్సీ కోటాలో హామిలు..ఇవన్నీ కేసీఆర్‌కు విస్తరణ చేసేందుకు చాలా టైం తీసుకునేలా చేశాయి. మొత్తానికి ఆ ఘట్టం ముగిసింది.  తమకు మంత్రివర్గంలో అవకాశం రాలేదని సీనియర్ నాయకులు వరుసగా విమర్శల వర్షం కురిపించారు. ముందురోజు ఎంతైతే నిరసన గళం వినిపించారో..నెక్ట్స్ డే అంతగా మళ్ళీ విధేయతను చూపించారు. అందుకు మంత్రి కేటీఆర్ చక్రం తిప్పారు. అవును ఆయన ఇప్పుడు టీఆర్‌ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా మారారు.

సీనియర్ లీడర్ ఈటెల..తప్ప ధిక్కార స్వరం వినిపించిన మిగతా నాయకులతో కేటీఆర్ మాట్లాడి సెట్ రైట్ చేశారని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, జోగు రామన్న , రసమయి బాలకిషన్, మాజీమంత్రి తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణా రెడ్డి, బాజిరెడ్డి, షకీల్… ఇలా నేతలందరితోనూ కేటీఆర్ పర్సనల్‌గా ఫోన్ చేసి మాట్లాడారట. కేసీఆర్ ఏం చెప్పారో ఏంటో తెలియదు కానీ నేతలంతా ఒక్కసారిగా సైలెంటైపోయారు.

ఇదోవంతు కాగా….అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ, ఇతర సందర్భాల్లో రాజకీయ నేతలు ఆఫ్ ద రికార్డుగా చెప్పే కబుర్లు, అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చేసే వ్యాఖ్యానాలు అందరికి తెలిసినవే. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు పిచ్చాపాటీగా మాట్లాడుకునే విషయాలు ఇక్కడే మీడియాకు ఉప్పందుతాయి. సభలో సౌండ్ చెయ్యనివారు కూడా లాభీల్లో మంచి లాజిక్‌లు మాట్లాడుతుంటారు.కానీ పార్టీకి డ్యామేజ్ చేసేలా లాభిల్లో ఎటువంటి మాటలు ఉపయోగించొద్దని ఆదేశాలు జారీచేశారంట టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల మంత్రి వర్గ విస్తరణ అనంతరం..కొత్తగా మంత్రి పదవిని సొంతం చేసుకున్న పువ్వాడ అజయ్ కుమార్.. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ లు ఎదురుపడ్డారు. ఆ వెంటనే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా సాగితే.. తాను మాత్రం తక్కువ తినలేదన్నట్లు పువ్వాడ గట్టిగానే సెటైర్లు వేశారట.

సుమన్ పువ్వాడతో మాట్లాడుతూ.. మొత్తానికి కేటీఆర్ చెవులు కొరికి మంత్రి పదవి కొట్టుకుపోయావ్ అన సరదాగా వ్యాఖ్యానిస్తే.. దానికి నవ్వుతూ బదులిస్తూ పువ్వాడ కూడా ధీటుగానే రియాక్ట్ అయ్యారు. మీరే స్టార్స్ .. మమ్మల్ని రానిస్తారా? అడ్డంగా మీరే నిలబడతారుగా? 24 గంటలూ కేటీఆర్ దగ్గరే ఉంటారు.. అక్కడే ఉండీ ఉండీ నువ్వూ ఓ పదవి కొట్టేశావ్ అని పువ్వాడ బదులిచ్చారు. అంతే కాదు.. తనకు కే క్యూబ్ కోటాలో మంత్రి పదవి వచ్చిందన్నారు. ఇంతకీ కేకేకే కోటా ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం. ఖమ్మం.. కమ్మ.. కేటీఆర్ అంటూ ట్రిపుల్ కే అంటూ చెప్పారంట.

తన తండ్రి కాలం నుంచి ఎంతో కష్టపడితే.. ఇన్నాళ్లకు మంత్రిపదవి వచ్చిందని.. నీ కళ్లు నా మీద పడనివ్వకు.. ఒక చేతకానిని తీసుకొచ్చి వివేక్ వెంకటస్వామి పదవి కోయించేశావ్ అంటూ నవ్వుతూనే పంచ్ వేశారు. దీనికి బాల్క బదులిస్తూ.. నువ్వేమన్నా తక్కువనా? ఒక రైజింగ్ స్టార్ (పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి).. ఒక సీనియర్ స్టార్ (తుమ్మల నాగేశ్వర్ రావు) ను కోయలేదా? అని రియాక్ట్ అయ్యారు. ఈ సంభాషణ మీడియాలో వైరల్ అయ్యింది.

అంతేకాదు.. మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తితో నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా లాభీల్లో మాట్లాడినవే. అవి పార్టీకి డ్యామేజ్ చేసేలా ఉండటంతో కేటీఆర్ ఈ మేరకు దిశానిర్దేశం చేశారట.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu