AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్‌కు కేటీఆర్ ఘాటు సమాధానం

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు సమాధానం ఇచ్చారు. తెలంగాణ నేతలు ఆంధ్రావాళ్లను అడ్డగోలుగా తిడుతున్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ‘‘డియర్ పవన్ కల్యాణ్ గారు, ఈ విషయంలో మీ ఆలోచన తప్పు. విభజన జరిగినప్పటి నుంచి 29 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ సుఖంగా జీవిస్తున్నారు. ఈ విషయం మీకు కూడా తెలుసు. దీనిపై మీరు కూడా నాతో అంగీకరిస్తారని భావిస్తున్నా. ఇలాంటి మాటలు నెగిటివీటిని పెంచుతాయి’’ అంటూ […]

పవన్‌కు కేటీఆర్ ఘాటు సమాధానం
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 23, 2019 | 9:33 AM

Share

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు సమాధానం ఇచ్చారు. తెలంగాణ నేతలు ఆంధ్రావాళ్లను అడ్డగోలుగా తిడుతున్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు.

‘‘డియర్ పవన్ కల్యాణ్ గారు, ఈ విషయంలో మీ ఆలోచన తప్పు. విభజన జరిగినప్పటి నుంచి 29 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ సుఖంగా జీవిస్తున్నారు. ఈ విషయం మీకు కూడా తెలుసు. దీనిపై మీరు కూడా నాతో అంగీకరిస్తారని భావిస్తున్నా. ఇలాంటి మాటలు నెగిటివీటిని పెంచుతాయి’’ అంటూ సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ సమాధానం ఇచ్చారు.

అయితే భీమవరంలో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వంపై పవన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏపీ రాజకీయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించిన పవన్.. తెలంగాణ నాయకులు ఆంధ్రావాళ్లను అడ్డగోలుగా తిడుతున్నా.. హైదరాబాద్‌లో ఉన్న మన ఎమ్మెల్యేలకు మాట్లాడటానికి ధైర్యం లేకుండా పోయిందని పవన్ వ్యాఖ్యలు చేశారు.

Follow Us