AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సన్న వడ్ల రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. వ్యవసాయ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో రైతులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు సాంకేతికత వినియోగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం దిగుబడులపై వ్యవసాయ శాఖకు సంపూర్ణ అవగాహన ఉండాలని పేర్కొన్నారు.

సన్న వడ్ల రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. వ్యవసాయ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
Cm Revanth Reddy Agriculture
Balaraju Goud
|

Updated on: Jun 16, 2026 | 3:44 PM

Share

తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో రైతులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు సాంకేతికత వినియోగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో బోనస్ అందించే ఏడు రకాల సన్న వడ్ల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందించడంతో పాటు రైతు వేదికల ద్వారా పంపిణీ చేయాలని ఆదేశించారు. సన్న వడ్లు పండించే రైతుల పూర్తి వివరాలను సేకరించాలని, ధాన్యం దిగుబడులపై వ్యవసాయ శాఖకు సంపూర్ణ అవగాహన ఉండాలని పేర్కొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో అమలు చేస్తున్న పైలెట్ ప్రాజెక్టును మరింత విస్తరించాలని ముఖ్యమంత్రి సూచించారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగాన్ని పెంచాలని, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను వ్యవసాయ సేవల్లో ఉపయోగించాలని చెప్పారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని నోడల్ ఏజెన్సీగా నియమించి, విత్తనాల సరఫరా నుంచి ధాన్యం కొనుగోలు వరకు వ్యవసాయ శాఖ, సివిల్ సప్లయిస్, అగ్రికల్చర్ యూనివర్సిటీ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

మార్క్‌ఫెడ్ నష్టాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, ఆయిల్‌ఫెడ్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేయాలని, యాప్ ద్వారా బుక్ చేసుకున్న యూరియాను రైతు వేదికల ద్వారా పంపిణీ చేయాలని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్లకు యూరియా పంపిణీ బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అదేవిధంగా ఎరువుల కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వానికి నిరంతరం లేఖలు రాయాలని, రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఎరువులను తెలంగాణకే కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు. ఈ అంశంపై అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని కూడా సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి... ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి... ఎందుకో తెలుసా..!
నాన్న చనిపోయాక జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?
నాన్న చనిపోయాక జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?
శ్రీరామ భక్తులకు అయోధ్య నుంచి శుభవార్త.. 70+ వయోవృద్ధులు..
శ్రీరామ భక్తులకు అయోధ్య నుంచి శుభవార్త.. 70+ వయోవృద్ధులు..
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. నిర్మలా క్లారిటీ..
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. నిర్మలా క్లారిటీ..