కెసీఆర్ సీరియస్ వార్నింగ్.. తలదూరిస్తే అంతేనన్న గులాబీ బాస్

మీరు అటువైపు వెళ్లొద్దు. ఆ విషయాల్లో వేలు పెట్టొద్దు. పార్టీకి చెడ్డ పేరు తేవొద్దు. రెండు రోజులు గులాబీ ఎమ్మెల్యేలకు ఫోన్లకు వచ్చిన మేసేజ్‌ ఇది. దీంతో వారంతా అలర్ట్‌ అయ్యారు. మైకులు కనిపిస్తే చాలు ఆమడ దూరం పరుగెడుతున్నారు. ఇంతకీ ఆ మేసేజ్‌ ఎక్కడి నుంచి వచ్చింది? ఎస్.. ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు నుంచే ఈ ఆదేశం అందింది.. మరి ఎవరికి ఆ సందేశం ? రెవెన్యూ ఇష్యూస్‌కు దూరంగా ఉండండి.. […]

కెసీఆర్ సీరియస్ వార్నింగ్.. తలదూరిస్తే అంతేనన్న గులాబీ బాస్
Follow us

|

Updated on: Nov 09, 2019 | 12:57 PM

మీరు అటువైపు వెళ్లొద్దు. ఆ విషయాల్లో వేలు పెట్టొద్దు. పార్టీకి చెడ్డ పేరు తేవొద్దు. రెండు రోజులు గులాబీ ఎమ్మెల్యేలకు ఫోన్లకు వచ్చిన మేసేజ్‌ ఇది. దీంతో వారంతా అలర్ట్‌ అయ్యారు. మైకులు కనిపిస్తే చాలు ఆమడ దూరం పరుగెడుతున్నారు. ఇంతకీ ఆ మేసేజ్‌ ఎక్కడి నుంచి వచ్చింది? ఎస్.. ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు నుంచే ఈ ఆదేశం అందింది.. మరి ఎవరికి ఆ సందేశం ?

రెవెన్యూ ఇష్యూస్‌కు దూరంగా ఉండండి.. రియల్ ఎస్టేట్ జోలికి వెళ్లొద్దు .. భూమి పంచాయతీల్లో తల దూర్చకండి .. తెలంగాణ సీఎం కేసీఆర్‌ నుంచి తాజాగా ఎమ్మెల్యేలకు వెళ్లిన సూచనలు ఇవి. తహశీల్దార్‌ విజయారెడ్డి హత్య తర్వాత భూమి అంశాలు సీరియస్‌గా మారాయి. సోషల్‌ మీడియాలో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు పాజిటివ్‌, నెగెటివ్‌గా వాదనలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యేలకు సీఎం ఆఫీసు నుంచి సూచనలు వెళ్లాయని తెలుస్తోంది.

ఎమ్మెల్యేల వద్దకు భూమికి సంబంధించిన ఫిర్యాదులు లేకపోతే…రెవెన్యూ శాఖకు సంబంధించిన కంప్లెంట్‌లు ఎక్కువగా వస్తాయి. ప్రజల్లో రెవెన్యూ శాఖ పై ఉన్న కోపం ఎమ్మెల్యేల పైకి మళ్లితే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారని.. ఈవిషయంలో జాగ్రత్తగా ఉండాలని సీఎం నుంచి సూచనలు వెళ్లాయని తెలుస్తోంది. ప్రస్తుతం హాట్ హాట్‌గా వున్న ఈ వ్యవహారంలో ఇలాంటి కామెంట్స్ చేయొద్దని ఎమ్మెల్యేలకు సీఎం నుంచి ఆదేశాలు వెళ్లాయట.

భూములకు సంబంధించిన వ్యవహారంలో ఎవరికి సహాయం చేసిన ఇంకొకరు శత్రువులు గా మారతారు. అందువల్ల ఇలాంటి ఇష్యూల్లో తలదూర్చక పోవడమే మంచిదని సీఎం నుంచి ఎమ్మెల్యేలకు సలహా వెళ్లిందని సమాచారం. కుటుంబ సభ్యులు ఎవరైనా వివాదాస్పద భూముల్లో లావాదేవీలు చేసుంటే… వెంటనే పరిష్కరించుకోవాలని భవిష్యత్తులో మీ మెడకే చుట్టుకునేలా చూసుకో వద్దు అని సీఎం ఆదేశించారట. మొత్తానికి ఎప్పటికప్పుడు పార్టీ పరంగా ఎమ్మెల్యేలు ఏం చేయాలో? చేయకూడదో సీఎంవో నుంచి ఆదేశాలు వెళుతున్నాయట. అందుకే కీలక నేతలు కూడా పలు అంశాలపై బహిరంగంగా మాట్లాడడం లేదని తెలుస్తోంది. మీడియా ముందుకు రావడం లేదని అంటున్నారు.