AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కె.ఏ.పాల్ కొత్తావతారం.. వీడియోలో ఏం చెప్పారంటే ?

ఆయన సీరియస్‌గానే చెప్తాడు..  కానీ తెలుగు ప్రజలంతా కామెడీగా తీసుకుంటారు. ఒక్కోసారి కామెడీ కూడా పండిస్తుంటాడు.. కానీ.. జనం నవ్వుకుంటూ అదో మాదిరిగా చూస్తారు.. ఎస్.. హి ఈజ్ కె.ఏ.పాల్. మొన్నటి ఎన్నికలకు ముందు తనకు సైలెంట్ వేవ్ వుందంటూ పోటీకి దిగి.. ముఖ్యమంత్రిని అవుతానంటూ తెగ సందడి చేసిన కె.ఏ.పాల్ ఎన్నికలు ముగిసిన వెంటనే అడ్రస్ లేకుండా పోయారు. కానీ అంతలోనే తాను సూపర్ డూపర్ టాస్క్‌లో యమా బిజీగా వున్నానంటూ ఓ వీడియో సందేశం […]

కె.ఏ.పాల్ కొత్తావతారం.. వీడియోలో ఏం చెప్పారంటే ?
Rajesh Sharma
|

Updated on: Nov 09, 2019 | 1:22 PM

Share
ఆయన సీరియస్‌గానే చెప్తాడు..  కానీ తెలుగు ప్రజలంతా కామెడీగా తీసుకుంటారు. ఒక్కోసారి కామెడీ కూడా పండిస్తుంటాడు.. కానీ.. జనం నవ్వుకుంటూ అదో మాదిరిగా చూస్తారు.. ఎస్.. హి ఈజ్ కె.ఏ.పాల్. మొన్నటి ఎన్నికలకు ముందు తనకు సైలెంట్ వేవ్ వుందంటూ పోటీకి దిగి.. ముఖ్యమంత్రిని అవుతానంటూ తెగ సందడి చేసిన కె.ఏ.పాల్ ఎన్నికలు ముగిసిన వెంటనే అడ్రస్ లేకుండా పోయారు. కానీ అంతలోనే తాను సూపర్ డూపర్ టాస్క్‌లో యమా బిజీగా వున్నానంటూ ఓ వీడియో సందేశం పంపాడు కె.ఏ.పాల్.
కమ్మరాజ్యంలోకి కడప రెడ్లు సినిమా తీస్తున్న దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. కెఏ పాల్‌ మీద ఓ పాట పెట్టి.. దాన్ని ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేసి తెగ హడావిడి చేసి పది రోజులై వుంటుంది. వర్మ ఆ సాంగ్ రిలీజ్ చేయగానే.. ఇక వర్మకు, పాల్‌కు రగడ తగులుకుందీ అనుకున్నారంతా. కానీ అందుకు భిన్నంగా కె.ఏ.పాల్ తెరమీదికొచ్చి తన స్టైల్ తనదేనని చాటుకున్నాడు.
ఎలక్షన్‌ ముందు కె.ఏ.పాల్ హడావుడి తెగ ఉండేది. మీడియా ఫోకస్‌ ఆయనపైనే ఉండేది. ప్రతిరోజూ ఆయన ఏదో ఒకటి హల్‌చల్‌ చేసేవారు. సీన్‌ కట్‌ చేసి చూస్తే ఫలితాల తర్వాత కనిపించకుండాపోయారు. తీరా ఆయన ఎటుపోయారని ఆరా తీస్తే…అమెరికా నుంచి ఓ వీడియో రిలీజైంది. తనను ముఖ్యమంత్రిని చేస్తే ఆంధ్రప్రదేశ్‌ను అమెరికాలా మారుస్తానని చెప్పిన కెఏ పాల్.. ఓడిపోయినా అదే పనిలో అమెరికా వెళ్ళాడా అనుకుంటే.. తన వీడియో సందేశం ద్వారా షాకిచ్చాడు పాల్.
ప్రజాశాంతి పార్టీ తరపు ఆయన  పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ. లోక్‌సభ స్థానాలు నుంచి పోటీ చేశారు. అసెంబ్లీకి పోటీ చేస్తే.. 281 ఓట్లు.. లోక్‌సభకు పోటీ చేస్తే 3037 ఓట్లు వచ్చాయి. ఆయనకంటే కొందరు స్వతంత్ర పార్టీల అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పత్తా లేకుండా పోయారు. కనీసం ఏపీకి రావడం లేదు. పాల్‌ ఎక్కడా అని ఆరా తీస్తే అమెరికా నుంచి ఫేస్‌బుక్ లైవ్‌లో కనిపించారు.
తాను అతిపెద్ద టాస్క్‌లో యమా బిజీగా వున్నానన్నది ఆయన వీడియో సందేశం సారాంశం. ఇంతకీ ఆ టాస్క్ ఏంటీ అంటే ప్రపంచం ఇప్పుడు మూడో ప్రపంచ యుద్దం ముంగిట్లో వుందని, దాన్ని నివారించడం ద్వారా ప్రపంచ శాంతికి కృషి చేస్తున్నానని కె.ఏ.పాల్ చెప్పుకున్నారు. అందుకోసం ప్రపంచాధినేతలను కలుస్తున్నానని.. తన అపాయింట్‌మెంట్ కోసం డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ వెయిట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు కె.ఏ.పాల్.
హమ్మయ్య.. ఎటెల్లిపోయాడో నా రాజు అనుకుని బెంగపడుతున్న తెలుగు ప్రజలకు కె.ఏ.పాల్ వీడియో సందేశం ఎంత ఊరటనిచ్చిందో అనుకుంటున్నారు నెటిజన్లు. మొత్తానికి పాల్‌ దొరికాడు. మళ్లీ ఎన్నికల సీజన్‌ వస్తేగానీ…ఆయన ఏపీలో కనిపించే పరిస్థితి లేదని చెప్పుకుంటున్నారు.