ఆశ్రమ బాటలో పవన్.. కారణమేంటి..!
ఎన్నికల్లో ఓడినప్పటికీ మొన్నటి వరకు ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ వచ్చిన జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పుడు రాజకీయాలకు కాస్త విరామం ఇచ్చారు. అనారోగ్యం దృష్ట్యా గత కొన్ని రోజులుగా కేరళలో ప్రకృతి చికిత్స తీసుకుంటూ మీడియాకు దూరంగా ఉంటూ వస్తోన్న ఇప్పుడు ఆశ్రమాల బాట పట్టారు. తాజాగా హరిద్వార్‌లో జనసేనాని దర్శనమిచ్చారు. మాత్రి సదన్ ఆశ్రమాన్ని గురువారం పవన్ సందర్శించారు. ఆధ్యాత్మిక గురువు, గంగా ప్రక్షాళన కోసం అసువులు బాసిన ప్రొ. జి.డి. అగర్వాల్ ప్రథమ […]
ఎన్నికల్లో ఓడినప్పటికీ మొన్నటి వరకు ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ వచ్చిన జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పుడు రాజకీయాలకు కాస్త విరామం ఇచ్చారు. అనారోగ్యం దృష్ట్యా గత కొన్ని రోజులుగా కేరళలో ప్రకృతి చికిత్స తీసుకుంటూ మీడియాకు దూరంగా ఉంటూ వస్తోన్న ఇప్పుడు ఆశ్రమాల బాట పట్టారు. తాజాగా హరిద్వార్‌లో జనసేనాని దర్శనమిచ్చారు. మాత్రి సదన్ ఆశ్రమాన్ని గురువారం పవన్ సందర్శించారు. ఆధ్యాత్మిక గురువు, గంగా ప్రక్షాళన కోసం అసువులు బాసిన ప్రొ. జి.డి. అగర్వాల్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తలకు సంప్రదాయమైన తలపాగాను చుట్టుకొని ఆయన అక్కడ సందడి చేశారు.
కాగా ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన వాటర్ మాన్ అఫ్ ఇండియా, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్ పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన విషయం అందరికి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్‌ను జీడీ అగర్వాల్ ప్రధమ వర్థంతికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఇందులో భాగంగానే పవన్ అక్కడికి వెళ్లారు. మెడ నొప్పి ఇంకా తగ్గనప్పటికీ.. రాజేంద్ర సింగ్ ఆహ్వానాన్ని మన్నించి.. పవన్ అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఆశ్రమంలో జరిగిన పలు కార్యక్రమాాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా శివానంద మహారాజ్ గంగా ప్రక్షాళన పోరాటాన్ని పవన్ కల్యాణ్‌కు వివరించారు. ‘‘గంగా ప్రక్షాళన కోసం స్వామి నిగమానంద సరస్వతి ఏ విధంగా పోరాటం చేశారు. 115 రోజులు నిరాహర దీక్ష చేసి ఎలా ప్రాణత్యాగం చేశారు’’ అనే విషయాలను ఆయనకు వివరించారు.
ఇన్ని రోజులు రాజకీయాల్లో బిజీబిజీగా గడిపిన జనసేనాని.. ఇప్పుడు ఆశ్రమాల బాట పట్టడానికి కారణమేంటని అందరిలో ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే మరోవైపు ఇన్ని రోజులు మీడియాకు పవన్ దూరంగా ఉండగా.. ఆయన ఆరోగ్యంపై పలు రకాల వార్తలు వినిపించాయి. కానీ తాజా ఫొటోలలో పవన్ ఆరోగ్యంగా కనిపిస్తుండటంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రజా సమస్యలపై పవన్ పోరాటం ఎప్పటికీ ఆగదని.. మానసిక ప్రశాంతత కోసమే మాత్రి సదన్ ఆశ్రమానికి వెళ్లారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే పవన్ త్వరలో చార్‌దమ్ యాత్ర కూడా చేపట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.