TV9 Telugu
31 October 2024
ఐపీఎల్ 2025 కోసం రిటైన్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితా సిద్ధమైంది. నేటితో ఈ లిస్ట్ బయటకు రానుంది.
IPL 2025లో అన్ని ఫ్రాంచైజీలు తమ ప్రస్తుత జట్టులో మొత్తం ఆరుగరు ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. వీరిలో, కేవలం ఐదుగురు భారతీయులు, ఒకరు విదేశీ ప్లేయర్లు ఉండాలి. ఇద్దరు అన్‌క్యాప్ ప్లేయర్లు కూడా చేర్చుకోవచ్చు.
ఐపీఎల్‌లో పాల్గొనే మొత్తం 10 జట్లు తమ తమ రిటెన్షన్ జాబితాలను సిద్ధం చేశాయి. మీడియా కథనాల ప్రకారం బీసీసీఐకి కూడా అప్పగించారు.
IPL 2025 కోసం రిటైన్ చేసిన ఆటగాళ్ల ప్రకటనకు చివరి తేదీ అక్టోబర్ 31న ఉంచింది. ఇందులో కూడా ఎలాంటి మార్పులు చేయలేదు.
ఈ సీజన్‌లో రిటైరైన అత్యంత ఖరీదైన ఆటగాడి రికార్డు బద్దలు కావడం ఖాయం. ఎందుకంటే మొదటి రిటైన్ చేసిన ఆటగాడికి రూ.18 కోట్లు ఫిక్స్ చేయగా, గత సీజన్ వరకు రూ.17 కోట్లు అందుకున్నాడు.
అయితే ఫస్ట్ రిటెన్షన్ కు రూ.18 కోట్లు ఫిక్స్ చేశారు. అయితే హెన్రిచ్ క్లాసెన్‌ను అట్టిపెట్టుకోవడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.23 కోట్ల వరకు చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. ఈ సీజన్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారవచ్చు.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డులు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ పేరిట కూడా ఉన్నాయి. బెంగళూరు 2018లో విరాట్‌ను, లక్నో 2023లో కేఎల్ రాహుల్‌ను రూ. 17 కోట్లకు అట్టిపెట్టుకున్నాయి.
ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 18 కోట్లకు అట్టిపెట్టుకుంది. అతను కెప్టెన్‌గా వ్యవహరించే ఛాన్స్ ఉంది. కేఎల్ రాహుల్ ఎల్‌ఎస్‌జితో బంధాన్ని తెంచుకున్నాడని, మెగా వేలానికి వెళ్లనున్నాడని వార్తలు వచ్చాయి.