Maharashtra: మహారాష్ట్ర ఎన్నికలపై కమలం స్పెషల్ ఫోకస్.. ప్రచారానికి ప్రధాని మోదీ, అమిత్ షా, యోగి

మహారాష్ట్ర ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ భారీ ప్లాన్ వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సహా బీజేపీ అగ్రనేతలను రంగంలోకి దింపుతోంది.

Maharashtra: మహారాష్ట్ర ఎన్నికలపై కమలం స్పెషల్ ఫోకస్.. ప్రచారానికి ప్రధాని మోదీ, అమిత్ షా, యోగి
Pm Modi, Amit Shah, Devendra Fadnavis
Follow us

|

Updated on: Oct 30, 2024 | 4:53 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోరు మొదలైంది. రాష్ట్రంలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి, మహావికాస్ అఘాడి మధ్య పోటీ నెలకొంది. రాష్ట్రంలోని 288 స్థానాలకు 7 వేల 995 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా జోరుగా ప్రచారం సాగుతోంది.

మహారాష్ట్ర ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ భారీ ప్లాన్ వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సహా బీజేపీ అగ్రనేతలను రంగంలోకి దింపుతోంది. అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ముమ్మర ప్రచారాన్ని ప్లాన్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పెద్ద నేతలు ఎన్నికల ప్రచారంలో తమ పూర్తి బలాన్ని చాటనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి పలువురు ప్రముఖులు మహారాష్ట్రలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 100కి పైగా బహిరంగసభలకు బీజేపీ ప్లాన్ చేసింది. పశ్చిమ మహారాష్ట్ర, విదర్భ, ముంబై-కొంకణ్, ఉత్తర మహారాష్ట్ర, మరఠ్వాడాలో ప్రధాని నరేంద్ర మోదీ మొత్తం 8 సభల్లో పాల్గొంటారు.

ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 8 రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నవంబర్ 7 నుంచి నవంబర్ 14 వరకు మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మహారాష్ట్రలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగసభలు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ బీజేపీకే కాకుండా మహాయుత అభ్యర్థుల తరుఫున ప్రచారం చేయనున్నారు. మోదీ ఎన్నికల ప్రచార బాధ్యతలను దేవేంద్ర ఫడ్నవీస్, నితిన్ గడ్కరీ, చంద్రశేఖర్ బవాన్కులేలకు అప్పగించారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా మహారాష్ట్రలో 15 సభలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా గోవా, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మహారాష్ట్రలో ప్రచారం చేయనున్నారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కంటే రెండు రెట్లు ఎక్కువగా హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అమిత్ షా మహారాష్ట్రలో 20 సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ముఖ్యమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల తేదీని ఇంకా వెల్లడించలేదు. అయితే దీపావళి తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..