AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: చంపుతామంటూ ఎమ్మెల్యేకు ఫోన్ బెదిరింపులు.. కాల్ చేసింది ఎవరంటే..?

వాట్సాప్ కాల్ చేసిన నంబర్ +44 కోడ్ ఉన్న దేశాన్ని వచ్చిందని గమనించి ఆ  వివరాలను సేకరించారు. లండన్ కోడ్ గా గుర్తించిన పోలీసులు కాంటాక్ట్ నంబర్ ద్వారా జరిపిన ఆర్థిక లావాదేవీలను కూడా ట్రేస్ చేశారు.

Telangana: చంపుతామంటూ ఎమ్మెల్యేకు ఫోన్ బెదిరింపులు.. కాల్ చేసింది ఎవరంటే..?
Choppadandi Mla Medipally Sathyam
G Sampath Kumar
| Edited By: |

Updated on: Oct 30, 2024 | 8:03 PM

Share

కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను బెదిరించిన కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. హెచ్చరించిన వ్యక్తిని గుర్తించడంలో సక్సెస్ అయ్యారు. నిందితుని నెంబర్ ఆధారంగా సాంకేతికతను అందిపుచ్చుకున్న కరీంనగర్ పోలీసులు అతని పూర్తి వివరాలను సేకరించారు. గత సెప్టంబర్ 28న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు +447886696497 నంబర్ నుండి వాట్సాప్ కాల్ వచ్చింది. రూ. 20 లక్షలు ఇవ్వాలని లేనట్టయితే మీ పిల్లలను అనాథలను చేస్తామని చెప్పి అగంతకుడు బెదిరించాడు. దీంతో కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే.

దీంతో భారతీయ న్యాయ సంహిత అనుసరించి పలు సెక్షన్ల కింద నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు పోలీసులు. నిందితుడు రంగారెడ్డి జిల్లా బోడుప్పల్ లోని భవాని నగర్ కు చెందిన యాస అఖిలేష్ రెడ్డి(33)గా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్న అఖిలేష్ రెడ్డి నెంబర్‌గా తేల్చారు. నిందితుడు లండన్ నుండే మేడిపల్లి సత్యంకు వాట్సాప్ కాల్ చేసినట్టుగా గమనించిన పోలీసులు అతనికి లుక్ ఔట్ సర్క్యూలర్ జారీ చేశారు. వాట్సప్ కాంటాక్ట్ నంబర్ ఆధారంగా పోలీసులు సైబర్ టెక్నాలజీ ద్వారా నిందితుని గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు.

అయితే వాట్సాప్ కాల్ చేసిన నంబర్ +44 కోడ్ ఉన్న దేశాన్ని వచ్చిందని గమనించి ఆ  వివరాలను సేకరించారు. లండన్ కోడ్ గా గుర్తించిన పోలీసులు కాంటాక్ట్ నంబర్ ద్వారా జరిపిన ఆర్థిక లావాదేవీలను కూడా ట్రేస్ చేశారు. బ్యాంకు ఖాతా నంబర్లను కూడా సేకరించిన పోలీసు అధికారులు అకౌంట్ ద్వారా పాస్‌పోర్టు నంబర్ సేకరించారు. పాస్ పోర్టులో ఉన్న వివరాల ద్వారా నిందితుని ఆచూకీ లభ్యం అయింది. దీంతో ప్రత్యేకంగా ఓ పోలీసు బృందాన్ని బోడుప్పల్ కు పంపించగా అఖిలేష్ రెడ్డి లండన్ లో ఉంటున్నట్టుగా పోలీసులు తెలుసుకున్నారు. అతను ఇండియాలోకి అడుగుపెట్టగానే అరెస్ట్ చేసేందుకు లుక్ ఔట్ సర్క్యూలర్ జారీ చేశారు. నిందితుడిని గుర్తించేందుకు సాంకేతికతను అందిపుచ్చుకుని సక్సెస్ అయ్యామని కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..