Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: చదువుల తల్లికి అండగా నిలిచిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఇంటికి పిలిచి మరీ..!

చదివే స్తోమత లేక కూలీ పనికి వెళ్తోంది. వారి కుటుంబ ఆర్ధిక ఇబ్బందుల గురించి తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి చలించిపోయారు. వెంటనే వారిని పిలిపించుకుని మాట్లాడారు.

Telangana: చదువుల తల్లికి అండగా నిలిచిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఇంటికి పిలిచి మరీ..!
Minister Komatireddy Venkat Reddy Humanity
Ashok Bheemanapalli
| Edited By: Balaraju Goud|

Updated on: Oct 30, 2024 | 5:19 PM

Share

మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. చదువుల తల్లికి అండగా ఉంటాని భరోసా ఇచ్చారు. ఎంబీబీఎస్ సీటోచ్చినా.. కూలీ పనులకు వెళ్తున్న విద్యార్థిని గురించి తెలుసుకుని చలించిపోయారు. వెంటనే స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చదువుకునేందుకు ఆర్ధిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు.

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం, సలాబత్ పూర్ గ్రామానికి చెందిన కాట్రోజు సుమలత మెడిసిన్‌లో ఉత్తమ ర్యాంక్ సాధించింది. కుటుంబ పరిస్థితులు తెలిసి చదివే స్తోమత లేక కూలీ పనికి వెళ్తోంది. వారి కుటుంబ ఆర్ధిక ఇబ్బందుల గురించి తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి చలించిపోయారు. వెంటనే వారిని పిలిపించుకుని మాట్లాడారు. ప్రతిభావంతురాలైన సుమలత చదువులకు ఆర్ధిక ఇబ్బందులు అడ్డుగా మారకూడదన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తాను సుమలతకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇవ్వడమే కాదు, సుమలత, తండ్రి శివరాంకు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈ సంవత్సరం చదువులకు కావల్సిన ఆర్ధిక సహాయం అందించారు. పుస్తకాలు, బట్టలు ఇతర ఖర్చులకూ ఆర్ధిక సహాయం చేశారు. మంచిగా చదువుకొని డాక్టర్ గా పేద ప్రజలకు సేవ చేయాలని ఆశీర్వదించారు.. ఏ ఇబ్బంది ఉన్నా నేనున్నాని భరోసా కల్పించారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందనతో సుమలత, తండ్రి శివరాం భావోద్వేగానికి గురయ్యారు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంతో అప్యాయంగా మాట్లాడారని, మేమేవరమో తెలియకపోయినా మా కష్టం తెలుసుకొన్నారు. మమ్మల్ని ఇంటికి పలిచి స్వీట్లు అందించి మర్యాద చేశారు. తన చదువులకు అండగా ఉంటానని చెప్పారని సుమలత భావోద్వేగానికి లోనయ్యారు. ఇక, మెడికల్ కాలేజీ యాజమాన్యంతో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి.. సుమలతకు కావల్సిన పుస్తకాలు, బట్టలకు అప్పటికప్పుడే ఆర్ధిక సహాయం చేశారు. చేయడమే కాదు.. ఐదేండ్లు ఆమె చదువుల బాధ్యత తీసుకుంటానని కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి తెలిపారు. మంత్రి సాయంపై సుమలతతోపాటు ఆమె కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తనలాంటి ఎందరో పేద విద్యార్ధుల చదువులకు అండగా నిలబడుతున్న మంత్రి కోమటిరెడ్డికి సుమలత కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..