ప్రచారంలో జగన్ వరాల జల్లు
ఏడాదికి రూ. 5లక్షలలోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికీ కొత్తగా యూనివర్సల్ హెల్త్ కార్డులు తీసుకువస్తానని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. నెలకు రూ. 40 వేల వరకు జీతం ఉన్నవారికి ఉచితంగా వైద్య సేవలు చేయిస్తామని తెలిపారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఇది ఎంతో లబ్ధి చేకూర్చుతుందని ఆయన అన్నారు. గుంటూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వైద్యం ఖర్చు రూ.1000 దాటితే యూనివర్సల్ హల్త్ కార్డు ద్వారా సహాయం అందుతుందన్నారు. ఈ […]

ఏడాదికి రూ. 5లక్షలలోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికీ కొత్తగా యూనివర్సల్ హెల్త్ కార్డులు తీసుకువస్తానని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. నెలకు రూ. 40 వేల వరకు జీతం ఉన్నవారికి ఉచితంగా వైద్య సేవలు చేయిస్తామని తెలిపారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఇది ఎంతో లబ్ధి చేకూర్చుతుందని ఆయన అన్నారు. గుంటూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వైద్యం ఖర్చు రూ.1000 దాటితే యూనివర్సల్ హల్త్ కార్డు ద్వారా సహాయం అందుతుందన్నారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది ప్రైవేటు, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఊరట లభిస్తుందని జగన్ చెప్పారు. ప్రైవేటు విద్యా సంస్థలలో ఫీజుల నియంత్రణకు రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఈ రెండు స్కీములు ముఖ్యమంత్రి పర్యవేక్షణలో అమలవుతాయని జగన్ చెప్పారు.
