AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు !

న్యూఢిల్లీ : భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎన్నిక‌ల మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారైంది. లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు వారం రోజుల వ్యవధి కూడా లేకపోవడంతో ఈనెల 7న తమ మ్యానిఫెస్టో విడుదల చేసేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. బీజేపీ మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ చీఫ్‌ అమిత్‌ షా సహా పలువురు సీనియర్‌ నేతలు పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని 20 […]

బీజేపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు !
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 05, 2019 | 7:19 PM

Share

న్యూఢిల్లీ : భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎన్నిక‌ల మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారైంది. లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు వారం రోజుల వ్యవధి కూడా లేకపోవడంతో ఈనెల 7న తమ మ్యానిఫెస్టో విడుదల చేసేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. బీజేపీ మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ చీఫ్‌ అమిత్‌ షా సహా పలువురు సీనియర్‌ నేతలు పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని 20 మంది సభ్యులతో కూడిన మ్యానిఫెస్టో కమిటీలో కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, నిర్మలా సీతారామన్‌, పీయూష్‌ గోయల్‌, రవి శంకర్‌ ప్రసాద్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తదితర నేతలు సభ్యులుగా ఉన్నారు. మ్యానిఫెస్టో కమిటీలో 15 ఉప సంఘాలను ఏర్పాటు చేశారు.

కాగా 2014 లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిది విడతల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్‌ జరిగిన ఏప్రిల్‌ 7న బీజేపీ తన మ్యానిఫెస్టో సంకల్ప్‌ పత్రను విడుదల చేసింది. అయితే ఈసారి పోలింగ్‌కు 48 గంటల ముందు ఏ పార్టీ తమ మ్యానిఫెస్టోలను విడుదల చేయరాదని ఈసీ ఆదేశించింది. ఇక లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ ఇప్పటికే తన మ్యానిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఏడు దశల పోలింగ్‌ ముగిసిన అనంతరం మ్యానిఫెస్టో విడుదల చేస్తారా అంటూ ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ బీజేపీని ఎద్దేవా చేశారు.

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా