బీజేపీ ప్రభంజనంపై మోదీ ఫస్ట్ ట్వీట్..

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అఖండ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్’ నినాదం గెలిచిందని ట్వీట్ చేశారు. భారత్ మళ్లీ గెలిచిందని పేర్కొన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. గత ఎన్నికల్లో బీజేపీ 282 సీట్లు గెలవగా, ఎన్డీఏ 336 సీట్లు గెలిచింది. ఈ ఎన్నికల్లో అంతకన్నా ఎక్కువ సీట్లే సొంతం […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:22 pm, Thu, 23 May 19
బీజేపీ ప్రభంజనంపై మోదీ ఫస్ట్ ట్వీట్..

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అఖండ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్’ నినాదం గెలిచిందని ట్వీట్ చేశారు. భారత్ మళ్లీ గెలిచిందని పేర్కొన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. గత ఎన్నికల్లో బీజేపీ 282 సీట్లు గెలవగా, ఎన్డీఏ 336 సీట్లు గెలిచింది. ఈ ఎన్నికల్లో అంతకన్నా ఎక్కువ సీట్లే సొంతం కానున్నాయి. బీజేపీ 280 పైగా సీట్లు సాధించే అవకాశం కనిపిస్తోంది. ఎన్డీఏ 340 పైగా సీట్లల్లో విజయం దిశగా దూసుకెళ్తోంది. దీనిని బట్టి చూస్తే పార్లమెంట్‌లో పూర్తి మోజార్టీ సాధించడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను అప్పుడే సొంతం చేసుకున్నట్టే.