‘అమరావతి పోరుకు సై’.. నారా రోహిత్ మెసేజ్!

‘అమరావతిలో పోరుకు సై’ అంటూ టాలీవుడ్ హీరో నారా రోహిత్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులపై..  తెలుగు ఇండస్ట్రీలోని ఇప్పటివరకూ ఏ ఒక్కరూ స్పందించలేదు. తాజాగా.. నారా రోహిత్ మాత్రమే ట్వీట్ చేశాడు. ‘అమరావతిలో రైతులు చేస్తోన్న పోరాటంలో నేనూ పాలుపంచుకోవడానికి రెడీ’ అంటూ ఫేస్‌బుక్‌లో ట్వీట్ చేశాడు. అయితే ఇప్పటివరకూ సైలెంట్‌గా ఉన్న ఈ హీరో.. ఇప్పుడు సడన్‌గా ఉద్యమానికి సై అంటూ ముందుకొచ్చాడు. ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:02 pm, Thu, 9 January 20
'అమరావతి పోరుకు సై'.. నారా రోహిత్ మెసేజ్!

‘అమరావతిలో పోరుకు సై’ అంటూ టాలీవుడ్ హీరో నారా రోహిత్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులపై..  తెలుగు ఇండస్ట్రీలోని ఇప్పటివరకూ ఏ ఒక్కరూ స్పందించలేదు. తాజాగా.. నారా రోహిత్ మాత్రమే ట్వీట్ చేశాడు. ‘అమరావతిలో రైతులు చేస్తోన్న పోరాటంలో నేనూ పాలుపంచుకోవడానికి రెడీ’ అంటూ ఫేస్‌బుక్‌లో ట్వీట్ చేశాడు. అయితే ఇప్పటివరకూ సైలెంట్‌గా ఉన్న ఈ హీరో.. ఇప్పుడు సడన్‌గా ఉద్యమానికి సై అంటూ ముందుకొచ్చాడు.

‘ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిది. విభజనతో జీవచ్ఛవంలా మిగిలిన రాష్ట్రానికి.. ప్రాణ సమానమైన భూముల త్యాగం చేసి.. అమరావతి రూపంలో ప్రాణం పోశారు. మీ ఔదార్యంతో అమరావతిలో పాలనకు బాటలు వేశారు. ఆ మార్గం చెదిరిపోకూడదని 23 రోజులుగా మీరు చేస్తున్న పోరాటం భావితరాలకు స్పూర్తిదాయకం. మీ ఉద్యమానికి సంకెళ్లు పడుతున్నా.. అలసిన గుండెలు మూగబోతున్నా మొక్కవోని దీక్షతో ముందడుగు వేస్తున్నారు. మీ పోరాటం వృథా కాదు. త్వరలో మీతో కలిసి మీ పోరాటంలో పాలుపంచుకుంటాను’.