యాక్టివ్‌గా కొండా దంపతులు.. మరి కూతురు సీటేది?

‘‘అమె అక్కడ… నేనిక్కడ.. కార్యకర్తలకు కొండంత అండగా ఉంటాం‘‘ అంటూ కొండా దంపతులు పార్టీశ్రేణులకు భరోసా ఇస్తున్నారు. అజ్ఞాతం వీడి జనం మధ్యలో హడావుడి చేస్తున్న కొండా కపుల్… ఎన్నికల వేళలో ఇప్పుడు మళ్ళీ చర్చగా మారారు.. వీరిద్దరు సరే.. మరి కూతురి సీటెక్కడ అని అడుగుతున్నారు కొండా అనుచరులు. వరంగల్ ఫైర్ బ్రాండ్‌గా పేరున్న కొండా సురేఖ.. మొన్నటి ఎన్నికల తరువాత నుంచి జిల్లాలో మౌనంగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొండా దంపతుల ప్రభావం […]

యాక్టివ్‌గా కొండా దంపతులు.. మరి కూతురు సీటేది?
Follow us

|

Updated on: Jan 09, 2020 | 7:02 PM

‘‘అమె అక్కడ… నేనిక్కడ.. కార్యకర్తలకు కొండంత అండగా ఉంటాం‘‘ అంటూ కొండా దంపతులు పార్టీశ్రేణులకు భరోసా ఇస్తున్నారు. అజ్ఞాతం వీడి జనం మధ్యలో హడావుడి చేస్తున్న కొండా కపుల్… ఎన్నికల వేళలో ఇప్పుడు మళ్ళీ చర్చగా మారారు.. వీరిద్దరు సరే.. మరి కూతురి సీటెక్కడ అని అడుగుతున్నారు కొండా అనుచరులు.

వరంగల్ ఫైర్ బ్రాండ్‌గా పేరున్న కొండా సురేఖ.. మొన్నటి ఎన్నికల తరువాత నుంచి జిల్లాలో మౌనంగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొండా దంపతుల ప్రభావం ఎక్కడా కనిపించలేదు. దీంతో కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో చర్చలు జరిగాయి. వారిని నమ్ముకున్న అనుచరులు తీవ్ర నిరుత్సాహంలో మునిగి పోయారు.

రాజకీయాల్లో కొండా దంపతులకు నిలకడ లేదన్న విమర్శలు కూడా వినిపించాయి. పార్టీలు మారడం… నియోజకవర్గాలు మార్చడంతో అసలు వీరు సొంత నియోజక వర్గం ఎక్కడ? వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుండి పోటీచేస్తారు? ఏపార్టీ నుండి పోటీ చేస్తారు? అనే ప్రశ్నలు అనుచరుల్లో మొదలయ్యాయి. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికలను ఓన్ చేసుకోవడానికి మళ్లీ రంగంలోకి దిగారు కొండా దంపతులు. గతవారం రోజుల నుండి ఫుల్ రీ-చార్జ్ అయి ప్రజల దర్శనమిస్తున్నారు. కొత్త-పాత కార్యకర్తల ఇళ్ల వద్దకు వెళ్లి వారిని పలకరిస్తున్నారు.

పలకరింపులు సరే వీరిలో ఎవరు ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారు… వీరిని నమ్ముకున్న వారికి ఎలా అండగా నిలుస్తారనే ప్రశ్నలు తాజాగా మొదలయ్యాయి. ఈ నేపద్యంలో కొండా మురళీధర్ రావు స్పష్టత ఇచ్చారు. వరంగల్ తూర్పు – భూపాలపల్లి ఈ రెండు నియోజకవర్గాలు తమవే అని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజక వర్గం నుండి పోటీచేస్తారని, తాను భూపాలపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని ప్రకటించారు.

రొటీన్ కు భిన్నంగా కార్యకర్తలతో మమేకమవుతున్న కొండా సురేఖ తూర్పు నియోజకవర్గంలో సెల్ఫీలతో సందడిచేశారు. 24 గంటలు తమ ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామన్న కొండా దంపతులు. త్వరలో రాబోతున్న వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ దమ్ము చూపిస్తామన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 23 డివిజన్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మొత్తం మీద ఇంతకాలం మౌనంగా ఉన్న కొండా దంపతులు… ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళలో మరోసారి చర్చగా మారారు. వీరిద్దరి సీట్లు రిజర్వేషన్ చేసుకున్నారు సరే… మరి వీరి రాజకీయ వారసురాలిని ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే అంశం ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..
‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.
చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!