AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19: కోవిడ్ సెంటర్‌లో డాక్టర్ అవతారమెత్తిన ఎమ్మెల్యే సాబ్… ఆస్పత్రిలో విగ్రహం పెట్టాలంటూ విమర్శలు

దేశంలో కరోనా విలయతాండం చేస్తున్న వేళ...ఐదో తరగతి డ్రాపౌట్ అయిన ఓ ఎమ్మెల్యే ఏకంగా డాక్టర్ అవతారమెత్తాడు. ఏకంగా కోవిడ్ పేషెంట్స్‌కు చికిత్స ఇస్తూ ఓవర్ యాక్షన్ చేసి పీకల్లోతు వివాదంలో చిక్కుకున్నాడు.

Covid-19: కోవిడ్ సెంటర్‌లో డాక్టర్ అవతారమెత్తిన ఎమ్మెల్యే సాబ్... ఆస్పత్రిలో విగ్రహం పెట్టాలంటూ విమర్శలు
Gujarat MLA Jhalawadia
Follow us
Janardhan Veluru

|

Updated on: May 24, 2021 | 7:34 PM

దేశంలో కరోనా విలయతాండం చేస్తున్న వేళ…ఐదో తరగతి డ్రాపౌట్ అయిన ఓ ఎమ్మెల్యే ఏకంగా డాక్టర్ అవతారమెత్తాడు.  కోవిడ్ పేషెంట్స్‌కు చికిత్స ఇస్తూ ఓవర్ యాక్షన్ చేసి రాజకీయ వివాదంలో చిక్కుకున్నాడు. గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే వీడీ జలవాడియా(VD Jhalawadia) రెండెసివిర్ వయల్ నుంచి సిరంజ్‌తో మెడిసిన్ తీస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సూరత్‌లోని ఓ కోవిడ్ సెంటర్‌లో కోవిడ్ పేషెంట్‌కు ఇంజక్షన్ వేసేందుకు ఆయన మెడిసిన్‌ను సిరంజ్‌లో తీస్తున్నట్లు ప్రచారం జరిగింది. కేవలం ఐదో తరగతి వరకే చదవిని ఎమ్మెల్యే సాబ్…కోవిడ్ సెంటర్‌లో డాక్టర్‌లా వ్యవహరించడం పట్ల నెటిజన్లు, విపక్ష నేతలు మండిపడుతున్నారు.

తనపై వచ్చిన విమర్శలపై స్పందించిన ఎమ్మెల్యే జలవాడియా…కోవిడ్ కేర్ సెంటర్‌లో గత 40 రోజులుగా స్వచ్ఛందంగా సేవ చేస్తున్నట్లు చెప్పుకున్నారు. అయితే వివాదంలో నానటం తనకు ఏ మాత్రం ఇష్టంలేదన్నారు. తాను సిరంజ్‌లో మెడిసిన్ ఎక్కించాను తప్ప…ఎవరికీ ఆ ఇంజక్షన్ వేయలేదన్నారు. ఆ సమయంలో తన చుట్టూ 10-15 మంది డాక్టర్లు ఉన్నారన్నారు. దాదాపు 200 మంది కోవిడ్ రోగులకు సేవలు అందించినట్లు చెప్పుకున్న ఎమ్మెల్యే…సిరంజ్‌తో తాను చేసిన ఓవర్ యాక్షన్‌ను సమర్థించుకునే ప్రయత్నం చేశారు.

అయితే ఎమ్మెల్యే బాధ్యతారాహిత్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్ రోగులకు సేవ చేస్తున్నట్లు చెప్పుకుంటూ ఎమ్మెల్యే ఇలా చేయడమంటే వారి ప్రాణాలతో చలగాటమాటడమేనని నెటిజన్స్ మండిపడుతున్నారు. చికిత్స ఎలా చేయాలో వైద్య సిబ్బంది ఎమ్మెల్యే దగ్గర నేర్చుకోవాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాజ్ సింగ్ ఎద్దేవా చేశారు. అవసరమైతే ఎమ్మెల్యే సాబ్ విగ్రహాన్ని ఆస్పత్రిలో పెట్టాలని చురకంటించారు. కోవిడ్ రోగులకు అత్యంత జాగ్రత్తగా చికిత్స కల్పించాల్సి ఉండగా…ఎమ్మెల్యే ఇలా డాక్టర్‌లా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి..పిల్లలపై మూడో కోవిద్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉండక పోవచ్చు, కేంద్రం స్పష్టీకరణ

 భారత్ లో 40 నుంచి 45 కోట్లమంది కరోనా బాధితులు..తేల్చి చెప్పిన ఐసీఎంఆర్ సీరో-సర్వే