టీడీపీ నాయకులు, కార్యకర్తలు కసిగా ఉన్నారు
విశాఖలో 15ఏళ్లుగా టీడీపీ జెండా లేదని, ఇప్పుడు టీడీపీని గెలిపించాలని నాయకులు, కార్యకర్తలు కసి కసిగా ఉన్నారని గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యే బరిలో ఉన్న గంటా.. ప్రచారంలో వేగాన్ని పెంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎక్కడికి వెళ్లినా ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. విశాఖను చంద్రబాబు నాయుడు చాలా అభివృద్ధి చేశారని.. ముఖ్యంగా హుద్ హుద్ తరువాత నగరాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు చంద్రబాబు చాలా కృషి చేశారని అన్నారు. […]

విశాఖలో 15ఏళ్లుగా టీడీపీ జెండా లేదని, ఇప్పుడు టీడీపీని గెలిపించాలని నాయకులు, కార్యకర్తలు కసి కసిగా ఉన్నారని గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యే బరిలో ఉన్న గంటా.. ప్రచారంలో వేగాన్ని పెంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎక్కడికి వెళ్లినా ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. విశాఖను చంద్రబాబు నాయుడు చాలా అభివృద్ధి చేశారని.. ముఖ్యంగా హుద్ హుద్ తరువాత నగరాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు చంద్రబాబు చాలా కృషి చేశారని అన్నారు. భీమిలి నుంచి పోటీ చేయాలన్నది తన అభిమతమని తెలిపిన గంటా.. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించే విశాఖ నార్త్ నుంచి పోటీ చేసేందుకు ఒప్పుకున్నానని అన్నారు.