యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు ఈసీ నోటీసులు
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ఓ బహిరంగ సభలో భారత సైన్యాన్ని ‘మోదీ సేన’గా యోగీ అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఆదిత్యనాథ్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 5లోపు ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ కోరింది. కాగా ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఇటీవల కేంద్రమంత్రి వి.కె.సింగ్ తరపున ప్రచారం చేసిన యోగీ.. ఉగ్రవాదులకు కాంగ్రెస్ […]

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ఓ బహిరంగ సభలో భారత సైన్యాన్ని ‘మోదీ సేన’గా యోగీ అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఆదిత్యనాథ్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 5లోపు ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ కోరింది.
కాగా ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఇటీవల కేంద్రమంత్రి వి.కె.సింగ్ తరపున ప్రచారం చేసిన యోగీ.. ఉగ్రవాదులకు కాంగ్రెస్ బిర్యానీ పెట్టి పోషిస్తే…మోదీ సేన వారికి బాంబులు, బుల్లెట్లతో సమాధానం చెబుతోందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా భారత సైనిక దళాన్ని ‘మోదీ సేన’గా అభివర్ణించినట్లు ఉన్నాయి. దీంతో ఈ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో దర్యాప్తు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. యోగీ ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించారా..? లేదా..? అన్నది పరిశీలించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను కోరింది. దానికి సంబంధించిన వాస్తవిక నివేదికను మంగళవారం జిల్లా కలెక్టర్ ఈసీకి అందజేశారు. వాటిని పరిశీలించిన ఈసీ, యోగీకి నోటీసులు జారీ చేసింది.
కాగా సైన్యానికి చెందిన కార్యకలాపాలను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోకూడదని ఇటీవలే ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలను ఆదేశించింది. అయినా యోగీ సైనికుల గురించి వ్యాఖ్యలు చేయడంపై ఎన్నికల కమిషన్ మండిపడింది. మరోవైపు యోగీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు కూడా భగ్గుమంటున్నాయి. ‘‘సైనం బీజేపీ సొత్తు కాదని, దేశ గొప్ప ఆస్తి’’ అని మమతా బెనర్జీ అన్నారు.



