గుల్బర్గా నుంచి ఖర్గే, భోపాల్ నుంచి దిగ్విజయ్
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలకు 38 మందితో కూడిన ఎనిమిదో జాబితాను కాంగ్రెస్ శనివారం అర్ధరాత్రి విడుదల చేసింది. ఇందులో లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గుల్బర్గా నుంచే ఖర్గే తిరిగి పోటీ చేయనుండగా.. అశోక్ చవాన్ నాందేడ్ నుంచి బరిలోకి దిగనున్నారు. శనివారం మధ్యాహ్నం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ప్రకటించినట్లుగానే సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ భోపాల్ నుంచి […]

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలకు 38 మందితో కూడిన ఎనిమిదో జాబితాను కాంగ్రెస్ శనివారం అర్ధరాత్రి విడుదల చేసింది. ఇందులో లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గుల్బర్గా నుంచే ఖర్గే తిరిగి పోటీ చేయనుండగా.. అశోక్ చవాన్ నాందేడ్ నుంచి బరిలోకి దిగనున్నారు. శనివారం మధ్యాహ్నం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ప్రకటించినట్లుగానే సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ భోపాల్ నుంచి పోటీ చేయనున్నారు. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్‌కు నైనిటాల్ లోక్‌సభ నియోజకవర్గాన్ని కేటాయించారు. భాజపా సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి బీసీ ఖండూరి తనయుడు మనీశ్ ఖండూరి ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. ఈయనకు గఢ్వాల్ నియోజకవర్గాన్ని కేటాయించారు. పార్టీలో ముఖ్య నేతలైన వీరప్ప మొయిలీ చిక్‌బళ్లాపూర్, కేఎం మునియప్ప కొల్లార్, మీనాక్షి నటరారజన్ మాందౌర్, రషీద్ అల్వీ అమ్రోహా స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. లోక్‌సభ అభ్యర్థులతో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు కూడా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే లోక్‌సభ సీటు దక్కించుకున్న అరుణాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నబామ్ టుకీకి అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలోనూ చోటు దక్కింది. కాంగ్రెస్ ఇప్పటి వరకు 543 లోక్‌సభ స్థానాలకు గానూ 218 మంది అభ్యర్థులను ఖరారు చేసింది.
The Congress Central Election Committee announces the eighth list of candidates for the ensuing elections to the Lok Sabha pic.twitter.com/ywRx1kMU5s
— Congress (@INCIndia) March 23, 2019