Quitting Coffee: సడెన్‌గా కాఫీ తాగడం మానేస్తే.. శరీరంలో జరిగే మార్పులేంటి? వాటికి ఎలా చెక్‌పెట్టాలి?
ప్రస్తుత రోజుల్లో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది కాఫీ, టీ వంటి పానియాలను తాగుతూ ఉంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి ఒక భాగమైపోయాయి. అయితే కాఫీలో కెఫిన్ ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా మంది కాఫీ తాగడాన్ని తగ్గించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో సడెన్‌గా కాఫీ తాగడం ఆపేస్తే మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది మధ్య తరగతి వారికి టీ, కాఫీ అనేది కేవలం ఒక పానియం మాత్రుమే కాదు.. ఇదొక ఎమోషన్. అలానే వారి డే మొత్తాన్ని సరిగ్గా నడిపించే ఇందనం. వీటిని మితంగా తీసుకుంటే ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం మన ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది టీ, కాఫీ లాంటి అలవాట్లను తగ్గించుకోవాలని చూస్తున్నారు. కానీ సడెన్‌గా ఈ అలవాటును మానుకోవడం వల్ల వచ్చే సమస్యలను దృష్టిలో ఉంచుకొని చాలా మంది వెనక్కి తగ్గుతారు. కాబట్టి ఎలాంటి ఆరోగ్య సమస్యల భారీన పడకుండా ఈ అలవాటును ఎలా మానుకోవాలో చూద్దాం.
ఫేమస్ డైటీషియన్, డయాబెటిస్ నిపుణుడు డాక్టర్ అర్చన బాత్రా ప్రకారం.. ఒకేసారి కాఫీ మానేయడం వల్ల మంచి జరగడం కంటే చెడే ఎక్కువ జరుగుతుందని అంటున్నారు. కెఫిన్ మన నాడీ వ్యవస్థకు ప్రోత్సహించడంతో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి అకస్మాత్తుగా దానిని ఆపడం వల్ల మెదడుకు రక్త ప్రవాహంలో మార్పులు వస్తాయి. దీని వల్ల మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని చెబుతున్నారు.
సడెన్‌గా కాఫీ మానేయడం వల్ల మన శరీరంలో వచ్చే మార్పులు
తీవ్రమైన తలనొప్పి: శరీరానికి తగినంత కెఫిన్ లభించనప్పుడు రక్త నాళాలు వ్యాకోచించడం జరుగుతుంది.. తర్వాత తలనొప్పి రావడం జరుగుతుంది. అలసట, నిద్రలేమి: సడెన్‌గా కాఫీ మానేడం వల్ల శరీరంలో కేఫిన్ పరిమాణం తగ్గి శరీరం దాని సహజ శక్తిని కనుగొనడంలో ఇబ్బంది పడుతుంటుంది. దీని వల్ల నిద్రలేమి సమస్యలు, ఎప్పుడూ అలసటగా అనిపించడం జరుగుతుంది. మానసిక స్థితి మార్పులు: సడెన్‌గా కాఫీ మానేయడం వల్ల మీరు మానసికంగా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అంటే అనవసరైమన ఆందోళన, ఏకాగ్రత కోల్పోవడం.. దేనిపై సరిగ్గా దృష్టిపెట్టలేకపోవచ్చు.
ఎలా నివారించాలి?
ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు మీరు రోజుకు నాలుగు కప్పుల కాఫీ తాగితే, దాన్ని సడెన్‌గా తగ్గించకుండా.. మెల్లమెల్లగా తగ్గిస్తూ రండి. అంటే మొదటి వారంలో మూడు, రెండో వారంలో రెండు, చివరకు ఒకటి ఇలా నెమ్మదిగా కాఫీని తగ్గించండి. ఇలా చేసే సందర్భంగా మీ శరీరంలో కెఫిన్ శాతం తగ్గుతుంది. కాబట్టి మీరు శరీరాన్ని హైడ్రెడ్‌గా ఉంచడం చాలా ముఖ్యం. ఇందుకోసం మీరు పుష్కలంగా నీరు తాగడం అలవాటు చేసుకోండి. కాఫీకి బదులుగా, మీరు తక్కువ కెఫిన్ కంటెంట్ ఉన్న గ్రీన్ టీ లేదా హెర్బల్ టీని అలావాటు చేసుకోండి. ఇలా మీరు క్రమం తప్పకుండా వీటిని పాటిస్తే.. ఎలాంటి సమస్యలు లేకుండా కాఫీని మానేవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
