AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala Photoshoot Controversy: శ్రీవారి సన్నిధిలో ఫోటో షూట్.. క్షమాపణ చెప్పిన కొత్తజంట

తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఫోటో షూట్ చేసుకొని భక్తుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కొత్త జంట తమ తప్పు తెలుసుకొని టీటీడీకి క్షమాపణలు చెప్పింది. మళ్లీ ఇలాంటి పొరపాట్లు జరగవని స్పష్టం చేశారు. మూడు రోజుల క్రితం తిరుమలలోని టిటిడి కళ్యాణ వేదికలో పెళ్లి చేసుకున్న ఈ జంట శ్రీవారి ఆలయం ముందు ఫోటోషూట్ చేసుకున్నారు. దీంతో కొత్త జంత తీరుపై భక్తులు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో వాళ్లు తమ తప్పు తెలుసుకొని టీటీడీకి క్షమాపణ చెప్పారు.

Tirumala Photoshoot Controversy: శ్రీవారి సన్నిధిలో ఫోటో షూట్.. క్షమాపణ చెప్పిన కొత్తజంట
Tirumala Reels Controversy
Raju M P R
| Edited By: |

Updated on: Jan 30, 2026 | 7:52 PM

Share

తిరువణ్ణామలైకి చెందిన తిరుమాల్, గాయత్రీ దంపతులు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్న కల్యాణ వేదికలో ఈ నెల 28 న వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తరువాత కళ్యాణ వేదిక నుంచి శ్రీవారి ఆలయం వద్దకు పసుపు బట్టలతోనే చేరుకున్న దంపతులు ఫోటోలకు ఫోజులిచ్చారు. కెమెరామెన్ల వెంట పెట్టుకుని వచ్చిన దంపతులు కాస్తా శృతి మించారు. ఆలయ ప్రాంగణంలో ఫోటోగ్రఫీ చేయరాదనే నిబంధన ఉన్నా కొత్తజంట తీసుకున్న ఫోటోలు, ఫోజులు అక్కడనున్న భక్తుల కంట పడింది. సెక్యూరిటీ సిబ్బంది గమనించకపోవడంతో ఆ వీడియోలు కాస్తా మీడియాకు చేరాయి.

దీనిపై స్పందించిన టిటిడి సెక్యూరిటీ ఆ జంట వివరాలపై ఆరా తీసింది. తిరువణ్ణామలైకి చెందిన తిరుమాల్, గాయత్రీ దంపతులుగా గుర్తించింది. శ్రీవారి ఆలయం ముందు ఫోటోషూట్ చేయరాదన్న విషయం ముందుగా తెలియకపోవడంతో అనుకోకుండా కొన్ని ఫోటోలు తీసినట్లు తెలుసు కున్నారు. అయితే, ఇది ఆలయ నియమాలకు విరుద్ధమని తెలిసిన వెంటనే, ఆ ఫోటోలను పూర్తిగా తొలగించినట్లు స్పష్టం చేశారు. ఈ అనుకోని తప్పు పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆ జంట భక్తులను, టీటీడీ అధికారులను క్షమాపణలు కోరింది.

తాము చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా, శ్రీవారి సేవ ద్వారా సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఇందుకు అవకాశం ఇవ్వాలని కోరింది. భక్తిసేవ ద్వారా తమ తప్పును పరిహరించుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేసింది. ఆలయ సంప్రదాయాలు, నియమాలు ప్రతి భక్తుడూ తప్పనిసరిగా గౌరవించాల్సినవేనని, ఈ ఘటనతో గుణపాఠం నేర్చుకున్నామని దంపతులు పేర్కొన్నట్లు టీటీడీ ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.