AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: స్నేహం కోసం ప్రభాస్ త్యాగం.. సూపర్ హిట్ కథను స్నేహితుడికి ఇచ్చేసిన పాన్ ఇండియా స్టార్

ఆయన కటౌట్ చూస్తే బాక్సాఫీస్ రికార్డులు వణకాల్సిందే. ‘బాహుబలి’తో తెలుగు సినిమా జెండాను ప్రపంచవ్యాప్తంగా ఎగురవేసిన ఆజానుబాహుడు ఆయన. ప్రస్తుతం వెయ్యి కోట్ల వసూళ్లను అలవోకగా దాటేస్తున్న ఆ పాన్ ఇండియా స్టార్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

Prabhas: స్నేహం కోసం ప్రభాస్ త్యాగం.. సూపర్ హిట్ కథను స్నేహితుడికి ఇచ్చేసిన పాన్ ఇండియా స్టార్
Prabhas And Friend
Nikhil
|

Updated on: Jan 30, 2026 | 9:04 PM

Share

కెరీర్ పరంగా ఎంత ఎత్తుకు ఎదిగినా, స్నేహం దగ్గరకు వచ్చేసరికి ఆయన ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. తన స్నేహితుడు కష్టాల్లో ఉన్నా లేదా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నా సరే.. తన దగ్గరకు వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని సైతం మొహమాట పడకుండా స్నేహితుడికి ధారపోస్తారు. సుమారు పది ఏళ్ల క్రితం ఒక యంగ్ డైరెక్టర్ ఒక స్టైలిష్ కథతో ఆయనను కలిశారు. కథ విన్న ఆయనకు అది బ్లాక్ బస్టర్ అవుతుందని ముందే అర్థమైంది. కానీ అప్పట్లో ఆయన ఒక భారీ సినిమాలో బిజీగా ఉండటంతో ఆ కథను తన ప్రాణ స్నేహితుడికి ఇచ్చి ఒక కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందించారు. ఇంతకీ ఆ మనసున్న మహారాజు ఎవరు? ఆయన త్యాగం చేసిన ఆ సూపర్ హిట్ సినిమా ఏంటో తెలుసుకుందాం..

పాన్ ఇండియా కింగ్ ..

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్. బాహుబలి సినిమాతో మొదలైన ఆయన జైత్రయాత్ర నేటికీ అప్రతిహతంగా కొనసాగుతోంది. ఆ తర్వాత వచ్చిన సాహో, సలార్, కల్కి 2898 ఏడీ వంటి సినిమాలు దేశవ్యాప్తంగా ప్రభాస్ మేనియాను చాటిచెప్పాయి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ‘స్పిరిట్’, ‘ఫౌజీ’, ‘కల్కి 2’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ‘స్పిరిట్’ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రభాస్‌కు అత్యంత సన్నిహితుడైన గోపీచంద్ పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకుపోయిన ఈ ఆరడుగుల బుల్లెట్, ఇటీవల సరైన విజయం కోసం పోరాడుతున్నారు. ‘పక్కా కమర్షియల్’, ‘రామబాణం’, ‘భీమా’ వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘విశ్వం’ కొంత ఉపశమనం కలిగించినా, గోపీచంద్‌కు ఒక సాలిడ్ హిట్ అవసరం చాలా ఉంది. ఈ క్రమంలోనే ప్రభాస్ – గోపీచంద్ మధ్య ఉన్న ఒక పాత స్నేహ బంధం గుర్తుకు వస్తోంది.

Prabhas And Gopichand

Prabhas And Gopichand

ప్రభాస్‌కు చెందిన ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ గురించి టాలీవుడ్‌లో అందరికీ తెలిసిందే. ఈ బ్యానర్‌లో తెరకెక్కే సినిమాల్లో ప్రభాస్ నేరుగా నటించకపోయినా, కథల ఎంపికలో ఆయన సలహాలు కచ్చితంగా ఉంటాయి. సుమారు పది సంవత్సరాల క్రితం ఒక కొత్త దర్శకుడు ఒక స్టైలిష్ యాక్షన్ కథను పట్టుకుని ప్రభాస్‌ను కలిశారు. కథ విన్న ప్రభాస్‌కు అది బాగా నచ్చింది. కానీ అప్పట్లో ఆయన ‘బాహుబలి’ షూటింగ్‌తో పూర్తి బిజీగా ఉన్నారు. ఆ దర్శకుడిని వేచి ఉంచడం ఇష్టం లేక, తన ప్రాణ స్నేహితుడు గోపీచంద్‌కు ఆ కథ సూట్ అవుతుందని భావించి ఆయనకు ఆ ఆఫర్ ఇప్పించారు.

సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘జిల్’..

ప్రభాస్ సూచనతో గోపీచంద్ ఆ కథ విని వెంటనే ఓకే చెప్పారు. ఆ సినిమా మరేదో కాదు.. 2014లో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘జిల్’. రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో గోపీచంద్ లుక్ ఒక అద్భుతం అని చెప్పాలి. రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా గోపీచంద్ కెరీర్‌లో ఒక స్పెషల్ మూవీగా నిలిచిపోయింది. తన కోసం ప్రభాస్ ఆ కథను వదులుకోవడం గోపీచంద్ కెరీర్‌కు ఎంతో ప్లస్ అయింది.

Jil Poster

Jil Poster

ఆ తర్వాతే ఇదే రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ‘రాధేశ్యామ్’ చేశారు, కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. సినిమా రంగంలో పోటీ అనేది సహజం, కానీ స్నేహం కోసం ఒక సూపర్ హిట్ కథను వదులుకోవడం అనేది కేవలం ప్రభాస్ లాంటి గొప్ప మనసున్న వ్యక్తికే సాధ్యం. ప్రభాస్ చేసిన ఆ చిన్న త్యాగం గోపీచంద్‌కు ఒక స్టైలిష్ హిట్ అందించింది. వీరిద్దరి మధ్య ఉన్న ఈ బంధం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది.

ఫ్రెండ్‌ కోసం సూపర్‌‌ హిట్ కథ వదులుకున్న ప్రభాస్‌
ఫ్రెండ్‌ కోసం సూపర్‌‌ హిట్ కథ వదులుకున్న ప్రభాస్‌
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డ్.. ఆ తోపు టీంలకే సాధ్యంకాలే
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డ్.. ఆ తోపు టీంలకే సాధ్యంకాలే
సడెన్‌గా కాఫీ తాగడం మానేస్తే.. శరీరంలో జరిగే మార్పులేంటి? వాటికి
సడెన్‌గా కాఫీ తాగడం మానేస్తే.. శరీరంలో జరిగే మార్పులేంటి? వాటికి
పామును మరో పాము కరిస్తే ఏమవుతుంది..? అవి చనిపోతాయా లేక బతుకుతాయా
పామును మరో పాము కరిస్తే ఏమవుతుంది..? అవి చనిపోతాయా లేక బతుకుతాయా
ఎన్టీఆర్ పితృ సమానులుగా భావించింది ఆయన్నే...
ఎన్టీఆర్ పితృ సమానులుగా భావించింది ఆయన్నే...
అకాల మరణం పొందితే ఆ ఆత్మలు భూలోకంలోనే తిరుగుతాయా.. గరుడ పురాణం..
అకాల మరణం పొందితే ఆ ఆత్మలు భూలోకంలోనే తిరుగుతాయా.. గరుడ పురాణం..
ఒకప్పుడు బాత్రూమ్స్ కడిగాడు.. ఇప్పుడీ జబర్దస్త్ నటుడు కోటీశ్వరుడు
ఒకప్పుడు బాత్రూమ్స్ కడిగాడు.. ఇప్పుడీ జబర్దస్త్ నటుడు కోటీశ్వరుడు
శ్రీవారి సన్నిధిలో ఫోటో షూట్.. క్షమాపణ చెప్పిన కొత్తజంట
శ్రీవారి సన్నిధిలో ఫోటో షూట్.. క్షమాపణ చెప్పిన కొత్తజంట
చికెన్ 65 కి అసలు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?
చికెన్ 65 కి అసలు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?
నుమాయిష్‌లో వంటల పోటీలు.. మీ చేతి రుచి చూపేందుకు సిద్దమా?
నుమాయిష్‌లో వంటల పోటీలు.. మీ చేతి రుచి చూపేందుకు సిద్దమా?