Natural Star Nani: మోస్ట్ కంఫర్టబుల్ హీరోయిన్ ఎవరు? నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్న నేచురల్ స్టార్ తెలివైన సమాధానం!
సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో పదుల సంఖ్యలో హీరోయిన్లతో కలిసి నటిస్తుంటారు. సహజంగానే ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా, ఏ ప్రమోషన్‌లో పాల్గొన్నా వారికి ఒక కామన్ ప్రశ్న ఎదురవుతుంది. "మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? లేదా ఎవరితో కలిసి నటించడం మీకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది?" అని అడుగుతుంటారు.

ఈ ప్రశ్నకు ఏ ఒక్క హీరోయిన్ పేరు చెప్పినా, మిగిలిన వారితో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చాలామంది హీరోలు నీళ్లు నములుతుంటారు. కానీ మన నేచురల్ స్టార్ మాత్రం అలా కాదు. తనదైన స్టైల్లో చాలా తెలివిగా, ఎదుటివారికి చుక్కలు చూపించేలా సమాధానం ఇస్తారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన సమాధానం చూస్తే.. “అబ్బా ఏం స్కెచ్ వేశావు బ్రో!” అనకుండా ఉండలేరు. తన పక్కన ఉన్న హీరోయిన్‌ను ఇంప్రెస్ చేస్తూనే, అందరినీ బురిడీ కొట్టించే ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం..
నాని తన కెరీర్‌లో అనేకమంది హీరోయిన్లతో పనిచేశారు. అయితే తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు ఆయన చాలా తెలివిగా బదులిచ్చారు. గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సాధారణంగా ప్రతి సినిమా ప్రమోషన్‌లోనూ ఈ ప్రశ్న ఎదురవుతుందని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఒక హీరోయిన్ పక్కన ఉన్నప్పుడు, ఆమెను బుక్ చేయాలనే ఉద్దేశంతోనే ఇంటర్వ్యూయర్లు ఇలాంటి ప్రశ్నలు వేస్తారని నాని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇది కచ్చితంగా తనను ఇరికించడానికి వేసే స్కెచ్ అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.
ఈ క్లిష్టమైన ప్రశ్నలను వివరిస్తూ నాని తన ‘అతడు’ సినిమాలో ఒక సీన్‌ను ఉదాహరణగా చూపించారు. ఆ టర్నింగ్ తిరిగితే అక్కడ రెండు సుమోలు ఉన్నాయి, నెక్స్ట్ టర్నింగ్ లో మూడు సుమోలు ఉన్నాయని చెప్పినట్లుగా.. ఈ ప్రశ్నలు కూడా చాలా క్లిష్టంగా ఉంటాయని ఆయన వివరించారు. మొదట ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకోవాలని చూసినా, ఇంటర్వ్యూయర్ మాత్రం “మీకు మోస్ట్ కంఫర్టబుల్ ఎవరు?” అని పట్టుబట్టడంతో నాని తన వ్యూహాన్ని మార్చేశారు.

Nani And Priyanka Mohan
ఆ సమయంలో నాని ‘సరిపోదా శనివారం’ ప్రమోషన్లలో భాగంగా ప్రియాంక మోహన్ పేరు చెప్పారు. అయితే దానికి ఆయన ఇచ్చిన వివరణ వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. “నేను అందుకే ఒక విషయం ఫిక్స్ అయ్యాను. ప్రతి సినిమాకి ఇదే ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి, ఆ సమయంలో ఏ సినిమా ప్రమోషన్‌లో ఉంటే.. నా పక్కన ఉన్న హీరోయిన్ పేరే చెబుతాను. అదే మోస్ట్ ఈజియెస్ట్ మార్గం” అని నాని స్పష్టం చేశారు. అంటే, తన పక్కన ఏ హీరోయిన్ అయితే ఉంటుందో, ఆ హీరోయిన్నే తన అత్యంత సౌకర్యవంతమైన సహనటిగా పేర్కొంటానని ఆయన వివరించారు.
లెక్చరర్ అవ్వాల్సింది..
నాని ఇచ్చిన ఈ లాజిక్ విన్న ఇంటర్వ్యూయర్ నోరెళ్లబెట్టారు. “మీరు లెక్చరర్ అవ్వాల్సింది” అని సరదాగా వ్యాఖ్యానించడం గమనార్హం. నాని ఈ విధంగా చెప్పడం వల్ల తన పక్కన ఉన్న హీరోయిన్ సంతోషపడటమే కాకుండా, పాత హీరోయిన్లకు కూడా తాను ఎందుకు ఆ పేరు చెప్పాల్సి వచ్చిందో ఒక క్లారిటీ ఇచ్చినట్లు అవుతుంది. ఈ మాస్టర్ ప్లాన్ తో నాని ఇబ్బందికరమైన ప్రశ్నలను సులభంగా దాటవేయడమే కాకుండా అందరినీ నవ్విస్తున్నారు. నాని నటనలోనే కాదు, ఇలాంటి ఇంటర్వ్యూలను హ్యాండిల్ చేయడంలో కూడా ‘నేచురల్ స్టార్’ అని నిరూపించుకున్నారు. తన సమయస్ఫూర్తితో అందరినీ ఆకట్టుకోవడంలో ఆయనకు ఆయనే సాటి.
