AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

One/4 Movie Review: వన్ బై ఫోర్ సినిమా రివ్యూ.. రివేంజ్ మూవీ లవర్స్ కోసం సరికొత్త డ్రామా..

కన్నడలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్‌ ప్రధాన పాత్రలో, బాహుబలి పళని కె దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ ఎమోషనల్ డ్రామా 'వన్ బై ఫోర్'. తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ పతాకాలపై నిర్మితమైన ఈ చిత్రం జనవరి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

One/4 Movie Review: వన్ బై ఫోర్ సినిమా రివ్యూ.. రివేంజ్ మూవీ లవర్స్ కోసం సరికొత్త డ్రామా..
One4 Movie
Rajitha Chanti
|

Updated on: Jan 30, 2026 | 9:31 PM

Share

మూవీ రివ్యూ: వన్ బై ఫోర్

నటీనటులు: వెంకటేష్, అపర్ణ మల్లిక్, హీనా సోని, టెంపర్ వంశీ, అపర్ణ శెట్టి, మధుసూధన రావు, సుహాని వ్యాస్ తదితరులు..

నిర్మాతలు: రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్

దర్శకత్వం: బాహుబలి పళని కె

కన్నడలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్‌ ప్రధాన పాత్రలో, బాహుబలి పళని కె దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ ఎమోషనల్ డ్రామా ‘వన్ బై ఫోర్’. తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ పతాకాలపై నిర్మితమైన ఈ చిత్రం జనవరి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

కథ:

వైజాగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో కిరణ్ (వెంకటేష్) చదువు పూర్తిచేసుకుని.. ఉద్యోగంలో చేరే ముందు లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటాడు. కిరణ్ ఉండే కాలనీలోనే పవిత్ర (హీనా సోనీ) తన పిల్లలతో నివసిస్తుంటుంది. ఆమె భర్త ఉపాధి కోసం దుబాయ్ లో ఉంటాడు. ఇదిలా ఉండగా, పవిత్ర కాలేజీ స్నేహితుడైన ఓ ప్రొఫెసర్ వైజాగ్‌కు ట్రాన్స్ఫర్ మీద వస్తాడు. ఫ్యామిలీ ఫ్రెండ్ గా పవిత్ర ఇంటికి వస్తుంటాడు. మొదట్లో వీరి బంధాన్ని కిరణ్ తప్పుగా అనుకున్నా, వారిద్దరిది స్వచ్ఛమైన స్నేహమని తర్వాత తెలుసుకుంటాడు. మరోవైపు బైక్ మెకానిక్ (టెంపర్ వంశీ), అతని ముగ్గురు స్నేహితులు ఈజీ మనీ కోసం క్రైమ్స్ చేస్తుంటారు. వీరికి కిరణ్‌తో పరిచయం ఏర్పడుతుంది. కిరణ్ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అతనికి దగ్గరవుతారు. ఒక సందర్భంలో పవిత్ర మంచితనం గురించి కిరణ్ ద్వారా తెలుసుకున్న ఈ నలుగురు దుర్మార్గులు, పవిత్రను టార్గెట్ చేస్తారు. ఆమెను బ్లాక్ మెయిల్ చేసి, అత్యాచారానికి పాల్పడతారు. ఈ దారుణం కిరణ్ కు ఎలా తెలిసింది? ఆ నలుగురిపై కిరణ్ ఎలా పగ తీర్చుకున్నాడు? అసలు కిరణ్ లవ్ స్టోరీకి ఈ కథకు లింక్ ఏంటి? అనేదే మిగతా సినిమా.

కథనం:

సమాజంలో జరిగే అఘాయిత్యాలు, వాటిపై హీరో తీసుకునే ప్రతీకారం అనే పాయింట్‌తో చాలా సినిమాలే వచ్చాయి. ‘వన్ బై ఫోర్’ కూడా అదే కోవలోకి వస్తుంది. అయితే పాత కథే అయినా, దర్శకుడు స్క్రీన్ ప్లేలో అక్కడక్కడా కాస్త రేసీగా రాసుకున్నాడు.. దానివల్ల పాత కథే అయినా కూడా కాస్త పర్లేదనిపిస్తుంది. ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయం, హీరో లవ్ స్టోరీతో సాగుతుంది. లవ్ ట్రాక్ కొంత రొటీన్‌గా అనిపించి బోర్ కొట్టిస్తుంది. కానీ ఎప్పుడైతే విలన్ గ్యాంగ్ పవిత్రను టార్గెట్ చేస్తారో, అక్కడ నుంచి సినిమా ఓకే అనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ కు ముందు వచ్చే సన్నివేశాలు, ఆ తర్వాత సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అవుతాయి. హీరో రివెంజ్ తీర్చుకునే విధానంలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. అయితే విలన్ గ్యాంగ్ మందు కొట్టే సన్నివేశాలు మరీ సాగదీసినట్లు అనిపిస్తాయి, వాటిని తగ్గించి ఉంటే బాగుండేది. కామెడీ కోసం చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. క్లైమాక్స్‌లో ఇచ్చిన సోషల్ మెసేజ్ మాత్రం ఆలోచించేలా ఉంది.

నటీనటులు:

హీరోగా వెంకటేష్ తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరయ్యాడు. తన పాత్రలో చక్కని పరిణితి చూపించాడు. ఇక పవిత్ర పాత్రలో హీనా సోనీ జీవించిందని చెప్పొచ్చు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన కంటతడి పెట్టిస్తుంది. విలన్ గా టెంపర్ వంశీ తనదైన శైలిలో భయపెట్టాడు. హీరోయిన్ అపర్ణ మల్లిక్, ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించారు.

టెక్నికల్ టీం:

పాటలు సోసోగా ఉన్నాయి. అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల అవసరానికి మించి లౌడ్‌గా అనిపిస్తుంది. సాంకేతిక పరంగా సినిమా పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది, విజువల్స్ బడ్జెట్‌కు తగ్గట్లుగానే ఉన్నాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ వహించాల్సింది, ముఖ్యంగా ఫస్టాఫ్ లో కొన్ని అనవసరమైన సీన్స్ కట్ చేసి ఉంటే సినిమా ఇంకా క్రిస్పీగా ఉండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా వన్ బై ఫోర్.. రొటీన్ రివెంజ్ డ్రామానే.. కానీ రివేంజ్ మూవీ లవర్స్‌కు ఓకే..!

వన్ బై ఫోర్ సినిమా రివ్యూ..
వన్ బై ఫోర్ సినిమా రివ్యూ..
అల్వాల్‌లో రెచ్చిపోయిన దొంగలు.. జ్యువెలరీ షాపులో షట్టర్ పగలగొట్టి
అల్వాల్‌లో రెచ్చిపోయిన దొంగలు.. జ్యువెలరీ షాపులో షట్టర్ పగలగొట్టి
అధికారినంటూ ఫోన్‌ చేస్తారు.. డిజిటల్ అరెస్ట్‌ అంటూ బెదిరిస్తారు..
అధికారినంటూ ఫోన్‌ చేస్తారు.. డిజిటల్ అరెస్ట్‌ అంటూ బెదిరిస్తారు..
ఫ్రెండ్‌ కోసం సూపర్‌‌ హిట్ కథ వదులుకున్న ప్రభాస్‌
ఫ్రెండ్‌ కోసం సూపర్‌‌ హిట్ కథ వదులుకున్న ప్రభాస్‌
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డ్.. ఆ తోపు టీంలకే సాధ్యంకాలే
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డ్.. ఆ తోపు టీంలకే సాధ్యంకాలే
సడెన్‌గా కాఫీ తాగడం మానేస్తే.. శరీరంలో జరిగే మార్పులేంటి? వాటికి
సడెన్‌గా కాఫీ తాగడం మానేస్తే.. శరీరంలో జరిగే మార్పులేంటి? వాటికి
పామును మరో పాము కరిస్తే ఏమవుతుంది..? అవి చనిపోతాయా లేక బతుకుతాయా
పామును మరో పాము కరిస్తే ఏమవుతుంది..? అవి చనిపోతాయా లేక బతుకుతాయా
ఎన్టీఆర్ పితృ సమానులుగా భావించింది ఆయన్నే...
ఎన్టీఆర్ పితృ సమానులుగా భావించింది ఆయన్నే...
అకాల మరణం పొందితే ఆ ఆత్మలు భూలోకంలోనే తిరుగుతాయా.. గరుడ పురాణం..
అకాల మరణం పొందితే ఆ ఆత్మలు భూలోకంలోనే తిరుగుతాయా.. గరుడ పురాణం..
ఒకప్పుడు బాత్రూమ్స్ కడిగాడు.. ఇప్పుడీ జబర్దస్త్ నటుడు కోటీశ్వరుడు
ఒకప్పుడు బాత్రూమ్స్ కడిగాడు.. ఇప్పుడీ జబర్దస్త్ నటుడు కోటీశ్వరుడు