MLC Jeevan Reddy : ‘టీఆర్ఎస్ అవినీతికి, రక్షణకు బీజేపీ’ నిలుస్తున్నాయన్న జీవన్ రెడ్డి.. ఈటల బలహీనపడ్డారని కామెంట్

టీఆర్ఎస్ అవినీతి చేస్తోంది.. జైల్‌కు వెళ్లడం ఖాయం' అని బండి సంజయ్ అంటున్నారు.. ఇంతకీ ఎప్పుడు జైల్లో పెడుతారు బండి సంజయ్..?

MLC Jeevan Reddy : 'టీఆర్ఎస్ అవినీతికి,  రక్షణకు బీజేపీ' నిలుస్తున్నాయన్న జీవన్ రెడ్డి..  ఈటల బలహీనపడ్డారని కామెంట్
Mlc Jeevan Reddy

Congress MLC Jeevan Reddy at Media : ‘టీఆర్ఎస్ అవినీతికి, రక్షణకు బీజేపీ’ నిలుస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ‘టీఆర్ఎస్ అవినీతి చేస్తోంది.. జైల్‌కు వెళ్లడం ఖాయం’ అని బండి సంజయ్ అంటున్నారు.. ఇంతకీ ఎప్పుడు జైల్లో పెడుతారు బండి సంజయ్..? అంటూ నిలదీశారాయన. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయిన దగ్గరి నుండి టీఆర్ఎస్ అవినీతి చేస్తోందని బండి సంజయ్ ఆరోపణలకు మాత్రమే పరిమితం అయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. ఈటల రాజేందర్ బీజేపీ లో జాయిన్ అవుతారని ఎవరు ఊహించలేదన్న ఆయన.. బీజేపీలో చేరుతుండటం వల్ల ఈటల బలహీన పడ్డారని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఉద్యమంలో ఈటల కీలకపాత్ర పోషించారని.. అలాంటి ఈటల బీజేపీలో చేరకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే పరిస్థితి వేరే విధంగా ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ వెనుకాల రాహుల్ గాంధీ ఉన్నాడన్న జీవన్ రెడ్డి.. పగ్గాలు చేపట్టినా, లేకున్నా కాంగ్రెస్ ను రాహుల్ గాంధీ నడిపిస్తున్నారని తెలిపారు.

Read also :  Sanjana Galrani : అన్నార్తులకు కొవిడ్ వేళ సినీనటి సంజన గల్రానీ ఆపన్నహస్తం.. దాదాపు నెల్లాళ్లుగా ఉచిత భోజన సేవ